కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ సోనియాగాంధీ

Latest News Political News

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు కొనసాగిన సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయం అధ్యక్షురాలిగా ఉంటానని పేర్కొన్నారు. ఇన్ని రోజులు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. కానీ ఎక్కడా కూడా ఆమె పూర్తి సమయం అధ్యక్షురాలిగా పనిచేయలేదు. లఖింపూర్ ఖేరీ హింస నుంచి గత కొన్ని వారాలుగా పెరుగుతున్న ఇంధన ధరల వరకు అనేక రకాల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో చర్చించింది. ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న ఉన్న మోడీ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ విమర్శించారు.

అదే సమయంలో సోనియా గాంధీ అన్ని రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులందరికీ బలమైన సందేశం పంపారు. “నేను ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసిన వారిని ప్రశంసించాను. మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనమందరం స్వేచ్ఛగా.. నిజాయితీగా చర్చించుకుందాం. అయితే ఈ గది నాలుగు గోడల వెలుపల కమ్యూనికేట్ చేయాల్సింది సిడబ్ల్యుసి సమిష్టి నిర్ణయం “అని సోనియా గాంధీ ప్రకటించినట్టు తెలిసింది. తదుపరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం 2022 సెప్టెంబర్ కంటే ముందు జరగవచ్చు. అప్పుడు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు. అప్పటివరకూ సోనియాగాంధీనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.

రాహుల్ గాంధీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్గా చేయాలని అనేక డిమాండ్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ క్యాడర్ని ఆయన ప్రభావితం చేసే స్థాయిలో లేరని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున సోనియా ఈ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *