BC caste and Sangha call for siege of Chalo Secretariat on July 15

Latest News

సమగ్ర కులగణన, 42 శాతం రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కుట్ర

న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టి, అడ్డుకునే ప్రయత్నం

స్పష్టమైన వైఖరిని చెప్పాలని ప్రభుత్వానికి అల్టిమేటం

హైదరాబాద్ : సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పస్టమైన వైఖరిని ప్రకటించకపోతే జులై 15న సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివిధ బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ..ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే..రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం..సమగ్ర కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే మరోసారి బీసీల గొంతు కోయాలని చూస్తోందని రాజారాం యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా…బీసీలను మోసం చేసిన చరిత్రేనని విమర్శించారు. రాహుల్ తాత జవహర్ లాల్ నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ ను అడ్డుకుంటే, మండల్ కమిషన్ రిపోర్టును నానమ్మ ఇందిరాగాంధీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే..దేశం విచ్చిన్నం అవుతుందని పార్లమెంట్ సాక్షిగా రాజీవ్ గాంధీ మాట్లాడటం బీసీలపట్ల గాంధీ కుటుంబానికి ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని, జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా ఎంతో తేలుస్తామని రాజ్యాంగాన్ని పట్టుకొని చెబుతున్న రాహుల్ గాంధీ మాటలకు విలువనివ్వరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మోదీకి ఓటేస్తే..రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం చేసిన మీరు..అధికారంలోకి రాగానే వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు.

కొంత రిజర్వేషన్ల అంశాన్ని కొందరు ప్రయివేటు వ్యక్తులతో హైకోర్టులో పిటిషన్ వేయించి.. దొడ్డదిదారిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, అదే జరిగితే..యావత్తు బీసీ సమాజం ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. భావి తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం బీసీ కులాలు, సంఘాలు ఒకతాటిపైకి వచ్చి, జులై 15న తలపెట్టిన చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా..బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండిగా ముందుకు వెళ్లితే.. వచ్చే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటరు లిస్టు ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయిస్తామని చెప్పడం..బీసీలను మభ్యపెట్టడమేనని ఆరోపించారు బీసీ హిందు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్. అయితే..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని ఎంపీటీసీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ ప్రశ్నించారు. మరోవైపు జులై 15న తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ న్యాయవాది, బీసీ సంఘం మహిళా నాయకురాలు శారదా గౌడ్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల క్రిష్ణ, అడ్వాకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, ముదిరాజ్ సంఘం నాయకులు రాజు ముదిరాజ్, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధికార ప్రతినిధి మహేష్ గౌడ్, ఓయూ విద్యార్థి నాయకుడు లింగం శాలివాహన, హిందు బీసీ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొంగర నరహరి, పద్మశాలి సంఘం నాయకులు అశోక్ పోశం తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy’s conspiracy on comprehensive caste census and 42 percent reservation
Trying to get into legal trouble
An ultimatum to the government to state a clear stand

Hyderabad: Janasabha state president Rajaram Yadav has warned the government that if it does not announce a clear stand on comprehensive caste census and 42 percent reservation for BCs in local bodies, they will lay siege to the secretariat on July 15. On Thursday morning, a press conference was held at Hyderabad Somajiguda Press Club along with various BC caste associations and BC associations. Speaking on this occasion, Rajaram demanded that the government should implement the promises announced in the Kamareddy Declaration. However, the Revanth Reddy government is trying to strangle the BCs once again without giving a comprehensive caste census and 42 percent reservation to the BCs, Rajaram Yadav alleged. He criticized that the entire history of the Congress party…is a history of cheating the BCs. Rahul’s grandfather Jawahar Lal Nehru’s uncle had blocked the Kalelkar Commission, while his grandmother Indira Gandhi had kept the Mandal Commission’s report in cold storage. He said that Rajiv Gandhi’s statement as a parliament witness that if reservation is given to BCs, the country will be divided is proof of the Gandhi family’s opposition to BCs. He asked Chief Minister Revanth Reddy whether he should value the words of Rahul Gandhi who is holding on to the constitution and saying that caste census will be done across the country and whose share will be determined on the basis of population. You who campaigned that if you vote for Modi, you will abolish the constitution and reservations, why are you ignoring them when you come to power?

Rajaram Yadav said that Chief Minister Revanth Reddy is conspiring to hold elections to the local bodies after filing a petition in the High Court with some private individuals on the issue of reservation. For the future of future generations of our children, BC castes and communities came together and appealed to the Chalo Secretariat siege program launched on 15th July. He said that even if the government bends its neck, the promises given to the BCs will be implemented. He said that BCs are ready to give due advice to the Congress party in the next election if they go ahead stubbornly without implementing the promises given. BC Hindu Mahasabha state president Battula Siddeshwar has accused BC Hindu Mahasabha state president Battula Siddeshwar of deceiving BCs by saying that reservation will be decided on the basis of voter list. However, MPTC Forum state president Karunakar Mudiraj alleged that the government has no idea of ​​giving 42 percent reservation to BCs. OU Student Unions JAC Chairman Elchala Dattatreya asked why the BC leaders in the Congress party are not talking about this. On the other hand, eminent lawyer and women leader of BC Association Sharada Goud appealed to make the Chalo Secretariat program launched on July 15 a success.

T.Journalists Forum State President Mekala Krishna, Advocate JAC State President Lodangi Govardhan, Mudiraj Association Leaders Raju Mudiraj, Nomads State President Nimmala Veeranna, BC Caste Sanghas United Platform Spokesperson Mahesh Goud, OU Student Leader Lingam Salivahana, Hindu BC Mahasabha State Working President Kongara Narahari, Padmasali Sangam leader Ashok Posham and others participated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *