బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. ఎందుకీ నిర్ణ‌యం?

గత కొద్ది రోజులుగా జైలు జీవితం గడుపుతున్న తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింత‌పండు నవీన్ బీజేపీలో చేరుతున్నట్టు క్యూ న్యూస్ ప్రకటించింది. మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. మరోవైపు ఆయన్ను జైలు నుండి విడుదల చేయించాలని ఆయన భార్య సైతం ప్రధాని మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షాకు ఈమెయిల్ ద్వారా వేడుకుంది. అయితే, గత కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ పెట్టిన […]

Continue Reading

సమగ్ర శిక్ష నిరుద్యోగ అభ్యర్థుల‌కు నియామక ప్రక్రియ చేప‌ట్టండి

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వ‌ర్క్‌): సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు అయిన DATA ENTRY OPERATOR,  IERP  (INCLUSIVE EDUCATION RESOURCE PERSON ), MIS COORDINATOR, SYSTEM ANALYST, ASSISTANT  PROGRAMMER నియామక ప్రక్రియ చేపట్టాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పైన తెలిపిన ఐదు విభాగాలకు సంబంధించిన 704 పోస్టులను భర్తీ చేయుటకు proc.Rc. No.2019/SS/T4/2019 ద్వారా 06/11/2019 రోజున నోటిఫికేషన్ ఇచ్చి 23/12/2019 రోజున రాత పరీక్ష […]

Continue Reading

Huzurabad Survey: హుజురాబాద్‌లో స‌ర్వే ఫ‌లితాలు

హుజురాబాద్‌లో గెలిచే అవ‌కాశం ఎవ‌రికి ఉంది? ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారు? ఎవ‌రిని ఓడించ‌బోతున్నారు? హుజురాబాద్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముంది? ఇటీవ‌ల హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మా ఛాన‌ల్ బృందం ప‌ర్య‌టించి అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో మేము హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సేక‌రించిన స‌మాచారం మీ ముందుంచుతున్నాం. హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల […]

Continue Reading

హుజురాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ […]

Continue Reading

కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? – రేవంత్‌పై జగ్గారెడ్డి సీరియ‌స్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో […]

Continue Reading

రేవంత్ ఆధ్వ‌ర్యంలో రాజ‌కీయ‌ అల‌జ‌డి

ఏడు సంవ‌త్స‌రాలుగా జ‌వ‌స‌త్వం లేని తెలంగాణ కాంగ్రెస్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియ‌మించ‌డంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వ‌చ్చింద‌నే చెప్పాలి. రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత నుంచి ఆ పార్టీ కార్య‌క‌లాపాలు చురుగ్గా సాగుతున్నాయి. గ‌తం నుంచే తెలంగాణ‌లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అయిన త‌రువాత మ‌రింత దూకుడు పెంచారు. స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో పాటు సీఎం కేసీఆర్ పై […]

Continue Reading

చరిత్ర సృష్టించిన ఆదివాసీల చదువుల తల్లి

తండ్రి ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన కూడా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలోనే చదివారామె.. విద్యార్థి నేతగా ఉద్యమాలు చేస్తూనే.. లా చేశారు. చిన్న వయసులోనే న్యాయకళాశాల ప్రిన్సిపల్‌ అయి వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డు సాధించారు. తెలుగునాట ఇలా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగానూ ప్రత్యేకతని సాధించారు గుమ్మడి అనూరాధ. హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వ‌ర్క్)అది బషీర్‌భాగ్‌ పీజీ న్యాయ కళాశాల. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలకు ఇప్పటిదాకా ప్రిన్సిపల్‌ ఎవరన్నది ఎవరికీ […]

Continue Reading

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

BREAKINGNEWS 🔴 PRIME TODAY చిన్నారి తల్లిని చిదిమేసిన ఆ మానవ మృగం ఇక లేదు. సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌  రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈనెల 9న సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు […]

Continue Reading

పనికిరాని బిగ్​బాస్ ​షో ఎందుకు?

ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకని సీపీఐ నారాయణ ప్రశ్న బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి గానీ, ప్రజలకు గానీ ఏమైనా ఉపయోగం ఉందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ‘ఈ షో ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది? ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఇలాంటి బూతుల ప్రపంచం వందల కోట్ల వ్యాపారానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ప్రోగ్రాంలో వాళ్ల కొట్లాటలు అనైతికంగా ఉన్నయ్’ అని నారాయణ శనివారం వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. […]

Continue Reading

ఈసారి ట్యాంక్​బండ్​పై నిమజ్జనం లేనట్టే..

హైకోర్టు ఆదేశాలతో గణేశ్ ​నిమజ్జనానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ, వాటర్​వర్క్స్​అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు అన్నీ ట్యాంక్​బండ్​కు రాకుండా.. ఆయా మండపాలకు సమీపంలోని చెరువుల వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ట్యాంక్​బండ్​పై నుంచి హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయడం నిషేధించిన ఆఫీసర్లు, పెద్ద పెద్ద విగ్రహాలు వస్తే.. పీవీఎన్ఆర్, ఎన్టీఆర్​మార్గ్​లో నిమజ్జనం చేసి, వెంటనే బయటకు తీసి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం కోసమే గతంలో సంజీవయ్య పార్కులో […]

Continue Reading