Dirty Fellow Movie Review

Entertainment

మాఫియా బ్యాక్‌గ్రౌండ్ స‌బ్జెక్టుతో కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటే అలాంటి సినిమాను ఆడియ‌న్స్ లైక్ చేస్తారు. తాజాగా అలాంటి స‌బ్జెక్టుతో వ‌చ్చిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించినఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో తాజాగా మే 24 శుక్ర‌వారం విడుద‌లైన‌ ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ | ఈ చిత్రంలో నాగినీడు మాఫియా డాన్‌ జేపీ పాత్ర‌లో న‌టించాడు. సత్య ప్రకాష్ పాత్ర‌లో శంకర్ నారాయణ న‌టించాడు. వీరిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తానే మాఫీయా డాన్‌గా మార‌చ్చ‌ని శంకర్‌ నారాయణ కుట్ర ప‌న్నుతాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు. మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది. ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు ఏంటీ? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ధియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌ | సిద్దు, డర్టీ ఫెలో పాత్రల్లో శాంతి చంద్ర సూప‌ర్‌గా చేశాడు. రెండు కారెక్టర్ల మధ్య తేడాను స్ప‌ష్టంగా చేశాడు. యాక్టింగ్, డైలాగ్స్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదుర్స్ అనిపించాడు. స్టైల్‌, యాక్షన్‌ తో ఈ త‌రం ఆడియన్స్‌ను మెప్పించాడ‌నే చెప్పొచ్చు. ఇక నాగినీడు చాలా రోజుల తరువాత అందరినీ ఆక‌ట్టుకున్నాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ 3పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు త‌గిన‌ ప్రాముఖ్యత ఉంది. మిగ‌తా వారు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం | సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దిన‌ట్టు క‌నిపిస్తుంది. ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్‌ చేశారు. సినిమాటోగ్రఫీ సూప‌ర్. సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు జీవం పోశాడు సతీష్‌ కుమార్‌.

విశ్లేషణ | మాఫియా బ్యాక్ డ్రాప్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా యాడ్ చేసిన‌ సినిమా ఇది. ద‌ర్శ‌కుడు స‌బ్జెక్టును తెర‌పై చూప‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్య‌డ‌నే చెప్పాలి. అయితే, స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉండాల్సింది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. అక్క‌డ‌క్క‌డ‌ ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ ఓపెనింగ్ నుంచే పాస్టుగా వెళుతున్న‌ట్టు అనిపిస్తుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌… హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్‌ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్‌ ఫూల్‌ సీన్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

రేటింగ్‌ 3.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *