హాలీవుడ్ రేంజ్ లో ‘ది మానిటి.ఇన్ ‘

Entertainment Latest News

మానవత్వం మంట కలిసినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది . దాని పర్యావసానం ఎలా ఉంటుంది అనే కథాంశంతో హాలీవుడ్ రేంజ్ లో ‘ ది మానిటీ. ఇన్ ‘ అనే భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు బిఎస్ రావు. టాలీవుడ్ లో పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు VFX ని అందించిన బిఎస్ రావు టాలీవుడ్ లో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు IMAX 8K ఫార్మెట్ లో హాలీవుడ్ చిత్రాలు మాత్రమే రూపొందాయి. కాగా ఆ టెక్నాలజీని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారు బిఎస్ రావు. హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మెట్ లో టాలీవుడ్ లో చేయడం అంటే గొప్ప సాహసమే మరి. ఆ సాహసానికి పూనుకున్నారు ఈ దర్శకులు.

తాజాగా ఈ చిత్ర పోస్టర్ డిజైన్ లను విడుదల చేసారు దర్శకులు బిఎస్ రావు. ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదిస్తున్నామని …. వాళ్ళు ఖరారు కాగానే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని … మొదటిసారి మెగా ఫోన్ పడుతున్న నేను ఐమాక్స్ 8K ఫార్మెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించే సాహసానికి నడుం కట్టానని, అందుకు నా సంకల్ప బలమే కారణమని స్పష్టం చేసారు. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యానికి శ్రీకారం చుడుతున్నానని …. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో తెలుగువాడి సత్తా చాటే చిత్రం మా ‘ది మానిటీ . ఇన్ ‘ అవుతుందన్న ధీమా వ్యక్తం చేసారు బిఎస్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *