చిన్నవయసులోనే ప్రజల అభిమానం పొందాడు.. ప్రజాప్రతినిధిగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడు.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పెట్టిస్తున్నాడు.. ఓ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎదుగుతోన్న ఈ తరం లీడర్ అజయ్ యాదవ్‌పై ఓ స్పెషల్ స్టోరీ.
నవతరం ఆశయాలకూ, ఆకాంక్షలకూ ప్రతిబింబించే ఓ నవతరం లీడర్ కావాలని కోరుకున్న బోడుప్పల్ 6వ డివిజన్ ప్రజలకు వరంలా దొరికాడు తోటకూర అజయ్ యాదవ్. ఇంకేం ఏరికోరి కార్పోరేటర్‌గా గెలిపించుకున్నారు. చిన్నవయసులోనే గెలిచిన ఈ కార్పోరేటర్ డివిజన్ అభివృద్ధికి పాటుపడుతున్న తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అజయ్ యాదవ్ తల్లిదండ్రులు తోటకూర వజ్రెష్ యాదవ్ – లక్ష్మి. తల్లి లక్ష్మి.. గతంలో బోడుప్పల్ సర్పంచ్‌గా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొందారు. ఇక అజయ్ తండ్రి వజ్రెష్ యాదవ్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర నాయకునిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా ఉంటూ పార్టీకి పునర్‌వైభవం తెచ్చే క్రమంలో వజ్రెష్ తనదైన పాత్ర నిర్వహిస్తున్నారు.
తల్లిదండ్రుల తరహాలోనే అజయ్ యాదవ్ చిన్నవయసు నుంచే రాజకీయాలపై ఆసక్తిపెంచుకున్నాడు. ప్రస్తుతం కార్పోరేటర్‌గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలు తీర్చుతున్నారు. ఆప్తమిత్రుడిలా అందరి మనసు దోచుకుంటున్నారు. బోడుప్పల్ పరిధిలోని కొన్ని సర్వే నంబర్‌లలో వక్స్ భూములున్నాయని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లు నిలిపివేసిందని దాంతో సుమారు 5 వేల కుటుంబాలు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తన గళం గట్టిగా వినిపించారు.ప్రజల జీవితాలు గాల్లో కలుస్తున్నాయంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎప్పటికప్పుడు కౌన్సిల్ మీటింగ్‌లో తన గళాన్ని వినిపిస్తూ డివిజన్ అభివృద్ధికి అహరహం కృషి చేస్తున్నారు ఈ యంగ్ లీడర్.
చిన్నవయసులోనే కార్పోరేటర్‌గా గెలిచిన అజయ్ యాదవ్.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడుగుజాడల్లో వెళుతున్నాడు. తనదైన శైలిలో ఈ తరం రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే క్రమంలో అజయ్ యాదవ్.. రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉన్న లీడర్‌గా దూసుకుపోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
#ThotakuraAjayYadav Thotakura Ajay Yadav