సర్వే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ 100% నిజం
పర్సెంటేజ్‌లలోనూ పర్‌ఫెక్ట్ రిజల్ట్స్
PRIME TODAY సంస్థ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఎప్పటికప్పుడు సర్వే ఫలితాలను, పబ్లిక్ పల్స్‌ను అందిస్తున్న ‘PRIME TODAY‘ మీడియా సంస్థ మరో మెట్టు ఎక్కింది. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠరేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అంటూ ‘PRIME TODAY’ చేసిన సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ 100 శాతం నిజమయ్యాయి. పర్సంటేజీలతో సహా ‘PRIME TODAY’ ఫలితాలు నిజమయ్యాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ‘మీరు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు?’ అంటూ రెండు నెలల క్రితం ‘PRIME TODAY’ సంస్థ బృందం నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. అందులో ‘బీజేపీకి ఓటేస్తాం’ అని 52 శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా విడుదలైన ఫలితాల్లోనూ 51.61 శాతం బీజేపీకి ఓట్లు పోలయ్యాయి.
అప్పటి సర్వే లింకు http://primetodaytv.com/latest-news/prime-today-huzurabad-survey-results/
అప్పటి సర్వే హైలైట్స్ లింకు http://primetodaytv.com/latest-news/prime-today-huzurabad-survey-highlights/
ఇక పోలింగ్ ముగిసిన సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ‘PRIME TODAY’ సంస్థ ఆ ఫలితాలు విడుదల చేసింది. ఇప్పుడు పోలింగ్ తర్వాత చూస్తే ఎగ్జిట్ పోల్స్ కూడా వంద శాతం నిజమయ్యాయి.
ఆ లింకు http://primetodaytv.com/latest-news/huzurabad-exit-poll-results/
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత గ్రామం హిమ్మత్‌నగర్‌లో షాక్ తప్పదని ఈ సర్వే ముందే చెప్పింది. ఆ మాదిరిగానే అక్కడ టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఓట్లు ఎక్కువ పోలయ్యాయి.

