ఢిల్లీ(ప్రైమ్‌టుడే ప్రతినిధి): ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ చేరికపై ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంది. ఇప్పటికే కొందరు ఆ పార్టీ నేతల అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.