మన ఎమోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “ఆరాధ్య” చిత్రం నుంచి హృదయాన్ని తాకే ‘నీ పుట్టుకే ఓ వరం’ పాటను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాటను ఆవిష్కరించారు.
ఈ పాటకు కెపిఎస్ చిన్న రచనతో పాటు దర్శకత్వం వహించగా, సంగీతాన్ని గోపినాథ్ కొండ అందించారు. సినిమాటోగ్రఫీని డానియల్ మదాసు అందంగా తెరకెక్కించారు. భావోద్వేగానికి ప్రధాన ప్రాధాన్యతనిచ్చిన ఈ పాట కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఎంతో ఆకట్టుకుంది.
పాటలో నటించిన చిన్నారి మరియు తండ్రి పాత్రధారి తమ సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను హత్తుకుని, పాటలోని ఎమోషన్‌ను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేశారు.
మొత్తంగా ‘నీ పుట్టుకే ఓ వరం’ పాట విడుదలతో ఆరాధ్య చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
