డైరెక్టర్స్ వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర చేతుల మీదుగా ఘనంగా “యంగ్ అండ్ డైనమిక్” మూవీ ట్రైలర్ ప్రారంభోత్సవం

Entertainment

హైదరాబాద్: టాలెంటెడ్ హీరో శ్రీ రామ్ – హీరోయిన్ మిథున జంటగా నటిస్తున్న సినిమా “యంగ్ అండ్ డైనమిక్”. ఈ సినిమాలో గా నటిస్తోంది. పి.రత్నమ్మ సమర్పణలో శ్రీరామ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామరాజు, లక్ష్మణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “యంగ్ అండ్ డైనమిక్” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ ను లాంఛ్ చేసి చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు. ఈ కార్యక్రమంలో

 

దర్శకుడు కిషోర్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ –

నేను దాసరి గారి శిష్యుడిని. నా మొదటి సినిమా మైండ్ గేమ్. ఆ సినిమా హీరో శ్రీరామ్ తోనే చేశాను. ఇప్పుడు “యంగ్ అండ్ డైనమిక్” రూపొందిస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. ఒక రౌడీ ఊరిని ఎలా నియంత్రిస్తాడు. ఆ రౌడీ మంచివాడుగా మారితే ఊరికి కలిగే లాభమేంటి అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఈ సినిమా ఇంత బాగా రూపొందడానికి బ్రదర్ హీరో శ్రీరామ్ కారణం. త్వరలోనే చిత్రాన్ని విడుదలకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

 

అతిథిగా వచ్చిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ –

చిన్న సినిమాకు మంచి జరగాలి, వాళ్ల కోసం రెండు మంచి మాటలు చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. “యంగ్ అండ్ డైనమిక్” ట్రైలర్ బాగుంది. ఇందులో మాస్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హీరో శ్రీరామ్ గారు ఫైట్స్ బాగా చేశారు. ఇలాంటి మాస్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందిన చరిత్ర టాలీవుడ్ కు ఎంతో ఉంది. ఈ సినిమాకు కూడా విజయం సాధించాలి. హీరో శ్రీరామ్ గారు పది చిత్రాల్లో నటించారు. “యంగ్ అండ్ డైనమిక్” సినిమాతో హీరోగా ఆయన మరింత పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా. అన్నారు.

 

అతిథిగా వచ్చిన డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ –

పెద్దలు, పూజ్యులు దాసరి గారు, రామానాయుడు గారు చిన్న చిత్రాలను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ఎవరు చిన్న సినిమా చేస్తున్నా వారికి సపోర్ట్ చేసేవారు. ఆ గొప్ప సంప్రదాయాన్ని పాటించాలనే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి చిన్న చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నాను. చిన్న సినిమా బాగుంటనే ఇండస్ట్రీలో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇండస్ట్రీ బాగుంటుంది. “యంగ్ అండ్ డైనమిక్” చిత్ర ట్రైలర్, సాంగ్ బాగుంది. హీరోగా శ్రీరామ్ మెప్పించాడు. నిర్మాతలు మరిన్ని సినిమాలు తీసి ఇండస్ట్రీలో స్థిరపడాలి. “యంగ్ అండ్ డైనమిక్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

 

అతిథిగా వచ్చిన డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ – శ్రీరామ్ హీరోగా నటిస్తున్న చిత్రాలకు నన్ను అతిథిగా పిలుస్తుంటారు. ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. హీరో శ్రీరామ్ కు మంచి పేరే తెచ్చే చిత్రమవుతుంది. ఇవాళ కంటెంట్ బాగున్న చిత్రాలే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్ సినిమాలతో పోటీ పడేలా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. యంగ్ అండ్ డైనమిక్ సినిమా కూడా అలాగే విజయం సాధించాలి. అన్నారు.

 

నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ – మా “యంగ్ అండ్ డైనమిక్” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో హీరోగా శ్రీరామ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ రోజు మా సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చి ఆశీర్వదించిన వీఎన్ ఆదిత్య గారికి, సముద్రగారికి, వీరశంకర్ గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమాను సపోర్ట్ చేయడం వారి పెద్ద మనసుకు అద్దం పడుతోంది. “యంగ్ అండ్ డైనమిక్” సినిమాను త్వరలోనే థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తాం. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

 

నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ – “యంగ్ అండ్ డైనమిక్” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణంలో శ్రీరామ రాజు గారితో కలిసి భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. హీరో శ్రీరామ్ ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ చేశాడు. ఇది కాకుండా మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. శ్రీరామ్ హీరోగా నేను నిర్మించిన మా రాముడు అందరివాడు సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. మా “యంగ్ అండ్ డైనమిక్” సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. అన్నారు.

 

హీరోయిన్ మిథున ప్రియ మాట్లాడుతూ – “యంగ్ అండ్ డైనమిక్” చిత్రంలో హీరో శ్రీరామ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు దక్కడం హ్యాపీగా ఉంది. నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తూ ప్రొడ్యూస్ చేశాను. ఇటీవల తనికెళ్ల భరణి గారితో అసుర సంహారం అనే మూవీలో నటించాను. “యంగ్ అండ్ డైనమిక్” చిత్రం మా టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.

 

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. మా ఊరికి మంచి పేరు తేవాలనేది నా కోరిక. ఇప్పటికి మైండ్ గేమ్, డేరింగ్ డాషింగ్, వేట, యంగ్ అండ్ డైనమిక్, మా రాముడు అందరివాడు వంటి చిత్రాలు చేశాను. మరికొన్ని కొత్త చిత్రాలు కూడా ప్రకటించబోతున్నాను. నా కెరీర్ లో వంద చిత్రాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. చిన్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సపోర్ట్ చేస్తాను. నాతో సినిమాలు చేస్తూ సపోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు లక్ష్మణరావు గారు, శ్రీరామరాజు గారికి థ్యాంక్స్. ఒక ఊరిలో పేదవాడికి, రౌడీకి మధ్య జరిగే సంఘర్షణే యంగ్ అండ్ డైనమిక్ సినిమా. ఈ చిత్రంలో రోప్స్ లేకుండా రియల్ ఫైట్స్ చేశాను. మంచి పాటలతో, కథా కథనాలతో మూవీ ఆకట్టుకుంటుంది. నా సోదరుడి లాంటి కిషోర్ శ్రీ కృష్ణ నాతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

 

 

నటీనటులు – శ్రీరామ్, మిథున ప్రియ, తదితరులు

 

టెక్నికల్ టీమ్:

బ్యానర్ – శ్రీరామ ప్రొడక్షన్

సమర్పణ – పి. రత్నమ్మ

డీవోపీ – బాలు, ఎ.బి.సి.డి

మ్యూజిక్ – కరీం, అమీర్

లిరిక్స్ – ప్రవీణ్ కుమార్

ఎగ్జిక్యూటివ్ మేనేజర్ – బాలరాజు

మేనేజర్ – మధు

పీఆర్ఓ – గోపి

నిర్మాతలు – శ్రీరామరాజు, లక్ష్మణరావు

రచన, దర్శకత్వం – కిషోర్ శ్రీ కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *