విడుదల తేది: 5/5/2023
నటీనటులు : అనిరుథ్,యశస్విని నివేదిత,రాజీవ్ కనకాల, జీవా,మధుమని తదితరులు..
సంగీతం: విజయ్ కురుకుల సినిమాటోగ్రఫీ: శ్రీను బొడ్డు
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాత : చంద్రకళ పందిరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
రియల్ ఇన్సిడెంట్ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సినిమాను ఇంతవరకు తెరకెక్కని కథతో వచ్చిన చిత్రమే ‘యాద్గిరి & సన్స్’. అనిరుధ్ – యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ చిత్రం ‘యాద్గిరి & సన్స్’. రోహిత్ విలన్ గా నటించాడు. సీనియర్ నటడు జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, మోతీలాల్, నాగరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా థియేటర్‌లలోకి వచ్చి సందడి చేస్తోన్న ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని అలరించిందా? అసలు ఈ సినిమా ప్రయోగం ఏంటీ? ఆ వివరాలు ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
సీనియర్ నటుడు జీవా టైటిల్ పాత్ర యాద్గిరిగా నటించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు లక్ష్మణ్(మోతీలాల్) పనిపాట లేకుండా తాగుతూ, తిరుగుతూ ఉంటాడు. యాద్గిరి మరొక కొడుకు వెంకట్(అనిరుధ్) ఓ ప్రైవేటు కంపెనీలో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అతడు ఓ కమర్షియల్ బ్యాంకులో పనిచేసే స్వాతి(యశస్విని)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఆమె లోకంగా బతికేస్తూ ఉంటాడు. అయితే ఓసారి వెంకట్ బీరువాలో దాచుకున్న డబ్బును… లక్ష్మణ్ దొంగతం చేసి తాగుతూ ఉంటాడు. అంత పెద్ద మొత్తాన్ని దొంగలించడంతో వెంకట్ కోపంతో తాగుతున్న తన అన్నపై గొడవ పడుతాడు. ఈ గొడవలో లక్ష్మణ్ చనిపోతాడు. దాంతో వెంకట్ జైలుపాలు అవుతాడు. ఆ తర్వాత వెంకట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తన అన్న చనిపోవడానికి అసలు కారణం ఏంటీ? స్వాతి ప్రేమను ఎలా పొందాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమాను థియేటర్‌లో చూడాలి.
విశ్లేషణ:
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాలకు బోలెడంత హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన మెయిన్ ప్లాట్ ను బేస్ చేసుకుని… ప్రేక్షకులను మెప్పించే విధంగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటేనే ఇలాంటి రియల్ ఇన్సిడెంట్ బెస్డ్ స్టోరీస్ కి ఆదరణ ఉంటుంది. ఇలాంటి కథలకు పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా, కథనమే ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు ఎంగేజ్ చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు బిక్షపతి రాజు పందిరి సక్సెస్ అయ్యాడు.
నిజంగా జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైంని బేస్ చేసుకుని.. దానిని అన్నదమ్ముల మధ్య ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న తగువులు లాంటి రోజూ మనం ప్రతి ఇంట్లో చూసే సన్నివేశాలనే తెరమీద చూపించి.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి… అసలు కథలోకి వెళ్లాడు దర్శకుడు. సెకెండాఫ్ మొత్తం రియల్ స్టోరీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా? అనే సందేహం వస్తుంది. కానీ చివర్లో న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను చూపెట్టడంతో… ప్రేక్షకుడు సినిమాపై మరింతా అభిమానం పెంచుకుంటాడు. ఇలా కూడా జరుగుతాయా అనుకుంటూ అలర్ట్ అవుతాడు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
రేటింగ్ 3.5 / 5