సమగ్ర శిక్ష నిరుద్యోగ అభ్యర్థుల‌కు నియామక ప్రక్రియ చేప‌ట్టండి

Latest News

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే నెట్‌వ‌ర్క్‌):

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు అయిన DATA ENTRY OPERATOR,  IERP  (INCLUSIVE EDUCATION RESOURCE PERSON ), MIS COORDINATOR, SYSTEM ANALYST, ASSISTANT  PROGRAMMER నియామక ప్రక్రియ చేపట్టాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

సమగ్ర శిక్ష అభియాన్ లో పైన తెలిపిన ఐదు విభాగాలకు సంబంధించిన 704 పోస్టులను భర్తీ చేయుటకు proc.Rc. No.2019/SS/T4/2019 ద్వారా 06/11/2019 రోజున నోటిఫికేషన్ ఇచ్చి 23/12/2019 రోజున రాత పరీక్ష నిర్వహించి 7/01/2020 రోజున ఫలితాలను, మెరిట్  కార్డులను జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది. అయితే, ర్యాంకులు ప్రకటించి నేటికీ ఏడాదిన్నర కాలం గడిచి పోయినప్పటికీ  అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి నియామక పత్రాలు అందజేయలేదు ఈ నియామక  పరీక్షల్లో దాదాపు 10 వేల మందికి పైగా అర్హత  సాధించి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు .

ఈ నియామకాల గూర్చి సమగ్ర శిక్ష అభియాన్  నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులందరూ కూడా తీవ్ర నిరాశ, భయాందోళనలకు గురవుతున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులను చాలా సార్లు కలిసి నియామక ప్రక్రియ చేయమని కోరగా COVID -19 వలన చేయలేకపోతున్నామని తెలుపుతున్నారు ప్రస్తుతం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి కావున మా యొక్క సమస్యను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన దృష్టికి తీసుకువెళ్లి మా నియామక ప్రక్రియ సమస్యని  పెద్దమనసుతో పరిష్కారం చేసి  మేము ఉద్యోగాలు పొందే లాగా చూడగలరని సమగ్ర శిక్ష నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *