హుజూరాబాద్ బై పోల్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ లో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజీనామా చేయి బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండటం తో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ స్థానం నుండి టిఆర్ ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. టిఆర్ ఎస్ నుండి అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ ఎస్ సీటు గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల గెలిస్తే ఈసీటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఈటల రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాబట్టి తన ఎమ్మెల్యే సీటును తిరిగి తానే గెలుచుకున్నట్లవుతుంది. ఈటెల గెలిస్తే ..అసెంబ్లీ లో కమలంపార్టీ బలం రెండునుండి మూడుకు పెరుగుతుంది.
హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ నేతలు ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు పెట్టారు ఇవి తాజాగా మాజీమంత్రి హుజూరాబాద్ లో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రు. 300 కోట్లు ఖర్చుచేసిన అధికార టీఆర్ ఎస్ మరో వెయ్యి కోట్లు రూపాయలు ఖర్చులు చేయటానికి రెడీగా ఉందుంటు ఈటల సంచలన ఆరోపణలు చేశారు. ఐతే మాజీ మంత్రి ఈటల చెప్పినట్లుగా అంత భారీ ఎత్తున ఖర్చు చేయటానికి ఏముంది ఉపఎన్నికల్లో ఇటు టీఆర్ ఎస్ గెలిచినా అటు బీజేపీ గెలిచినా ప్రభుత్వంలో మాత్రం పెద్దగా మార్పు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే గెలుపోటములు పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఉండదు.
ఈటల ఓటమి సీఎం కేసీఆర్ ఇజ్జత్ కు సవాలైపోయింది. టీఆర్ ఎస్ ఓడిపోతే కేసీఆర్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉండికూడా ఓ ఉపఎన్నికలో టీఆర్ ఎస్ తన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయిందంటే అది కేసీఆర్ కు ఎంత అవమానమో అందరికీ తెలిసందే. అందుకనే ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిని గెలిపించుకోవటం కేసీఆర్ కి చాలా ముఖ్యమైంది. అందుకనే ఈటల చాలా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టే ఇప్పటికే టీఆర్ఎస్ రు. 300 కోట్లు ఖర్చుపెట్టిందని మరో వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీగా ఉందంటు ఒకటే గోల చేస్తున్నారు. బహుశా ఈటల ఉద్దేశ్యంలో ఖర్చు చేసిన 300 కోట్ల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు చేసిన ఖర్చేమో.
ఈటలను ఎలాగైనా ఓడించటమే టార్గెట్ గా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజరుచేశారు. రోడ్లు వేయించటం సామాజికవర్గాల వారీగా భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలకు ముందు మంజూరు చేసిన నిధులు రు. 300 కోట్లంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక వెయ్యి కోట్ల రూపాయలంటేనే మరీ నమ్మబుద్ది కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఖర్చులు చేయటంలో ఈటల కూడా తక్కువేమీకాదు. బీసీ సామాజికవర్గం నేత అయినంత మాత్రాన ఈటలను తక్కువగా అంచనా వేసేందుకు లేదు. ఆర్దికంగా ఈటల కూడా బాగా సౌండ్ పార్టీయేనట. అయితే ఈటెల సంచలన వ్యాఖ్యల పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.