డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
____________________________________________________________________________
కేసీఆర్, కేటీఆర్ కంటే వారం రోజుల ముందు నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు అరుపులు, సవాళ్లు, వెక్కిరింతలు ఎక్కువైనాయి. తండ్రిలాంటి కెసిఆర్ ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటెల కించపరిచినారనే హరీష్ ఒక్కసారైనా తోటి ఉద్యమకారులను తూలనాడి, గొంతులు కోస్తున్న కేసీఆర్‌ను ఎందుకు వారించలేదు. మంత్రులుగా ఉన్న ప్రగతిభావన్ లో వెంట్రుక మన్దమ్ విలువ లేదని ఈటలను రెచ్చగొట్టింది హరీష్ రావు కాదా..? ఎవరో ఒకరు ధిక్కారం ప్రదర్శించకుంటే ఎట్లా అని ఈటలను ముందుకు నెట్టి బలిపశువును చేసింది హరీష్ కాదా..? ఆత్మగౌఅరవం అంటే గడియారాలు, వెండి గ్లాసులు పంచితే వస్తదా అనే హరీష్ కు దళిత సాధికారత అంటే ప్రజల డబ్బును ఒక్క హుజురాబాద్ లో గాలికి పంచినట్లు అర్థమా..? బంగారు తెలంగాణ ను గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట లో బీరు, బిర్యానీ, పచ్చనోట్లు పంచకుండానే సాధిస్తున్నారా..?
ఆత్మవంచనకు పరాకాష్టగా ఉద్యమస్ఫూర్తిని తుంగలో తొక్కి మామ చెప్పగానే నమ్మినోన్ని నట్టేట ముంచి హుజురాబాద్ లోనే తాతల తండ్రుల నుండి ఇక్కడే ఉన్నట్టు మకాం వేసి గెల్లు శ్రీనివాస్ ను బలిపశువును చేస్తూ బహుజనులను అపహాస్యం చేస్తున్నారు హరీష్, కెసిఆర్.
తెలంగాణ స్వరాష్ట్ర విద్యార్థి నాయకుడికి హుజురాబాద్ టికెట్ కేటాయించినందుకు గౌరవిస్తూనే ఎన్నికలు చంద్రశేఖర్ రావు అహంకార వ్యక్తిగత పోకడలకు వ్యతిరేకంగా నిలబడుతున్న శక్తులది గనుక ప్రజలు ధిక్కారానికి మొగ్గు చూపుతారు. తెలంగాణాలో రాజకీయాన్ని హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూ తిరుతున్నట్టు కెసిఆర్ భ్రమ కల్పిస్తూ పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు, పాత పార్టీల పూర్వ వైభవం కూడా కొనసాగుతుంది. మాజీ ips ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్గొండలో బీఎస్పీ పార్టీ చేసిన సందర్బంగా ఆతిధ్యం ఇచ్చినందుకె నార్కట్పల్లి మండల తహశీల్ధార్ రాధ పై బదిలీ వేటు వెయ్యడం, పోడు చేసుకుంటున్న అడవి బిడ్డలను జైళ్లలో వేసి చిత్రహింసలు పెట్టడం, మరుగుదొడ్లు కడిగించడం. ఇంద్రవెల్లి సభ సందర్బంగా వందలాది ఆదివాసీ గూడాల్లో నిఘా, కేసులు అన్నిటికంటే ముఖ్యంగా దళిత బంధు గురించి ఇంత మొత్తుకొని ఏ జిల్లాలో ఏ పథకం అమలు చెయ్యకుండా చేతులు ఎత్తెయ్యడం – ఇవన్నీ హరీష్ కు, కేటీర్ కు హుజురాబాద్లో బోబ్బా పెట్టె అప్పుడు కనిపించడవా..?