వాషింగ్టన్ డీసీ: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వాషింగ్టన్ డీ.సీ చాఫ్టర్ వనితా టీమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న బ్రాడ్ రన్ హైస్కూల్ ఆశ్ బర్న్, వర్జీనియాలో బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటాయ్. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిచేయడంలో జరుగుతున్న ప్రయత్నంలో టీడీఎఫ్ గత 18 సంవత్సరాలుగా అమెరికాలోని పలు మెట్రో నగరాలలో బతుకమ్మ, దసరా సంబరాలను జరుపుతున్నది. వాషింగ్టన్ డి.సి బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 3 వేల 8 వందల మందికి పైగా అన్ని ప్రాంతాల ప్రజలు అందమైన బతుకమ్మలని పేర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక అతిథిగా TDF USA అధ్యక్షులు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, TDF USA చైర్మెన్ వెంకట్ మారం, టీడీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మురళీ చింతలపాణి ప్రత్యేక అతిధులుగా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో టీడీఎఫ్ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. జై కిసాన్, మన తెలంగాణ బడి, ఆరోగ్య సేవ, వనిత చేయూత.. వంటి కార్యక్రమాలను వారు వివరించారు.
ఇండియా నుండి ప్రఖ్యాత శిల్పి, కళాకారులు MV రమణా రెడ్డి “తెలంగాణ అమరవీరుల స్మారక” చిహ్న రూపకర్త 80కి పైగా దేశాల్లో తన కళలను ప్రదర్శించిన అంతర్జాతీయ శిల్పి, TDF DC బతుకమ్మ సంబరాల్లో “ పాత్ టు ఆర్టిస్టిక్ బ్రిలియన్స్, ఏ జర్నీ అన్వీల్డ్” అనే తన పుస్తకం ఆవిష్కరించాడు.
ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేక ఆకర్షణగా “ఎల్లిపోతావురా మనిషి మనిషి”, “బాగుండాలి మనిషి” అనే పాటలతో “Swathi Reddy UK” ఛానల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కదిలించి, ఎందరికో దగ్గరయిన గాయని, మన తెలంగాణ ఆడపడుచు “స్వాతి రెడ్డి” బతుకమ్మ పాటలు పాడుతూ, స్త్రీలతో కలసి ఆడుతూ అందరిలో జోష్ నింపారు. వాషింగ్టన్ డిసి , వర్జీనియాకి చెందిన పలు రాజకీయవేత్తలు, కమ్మూనిటీ నాయకులు స్త్రీలతో కలసి బతుకమ్మ ఆడారు. రంగురంగుల, ఆకర్షణీయమైన పురుషుల, స్త్రీల, పిల్లల అందమయిన బట్టలు, నగలు సరసమైన ధరలకు అందించడానికి ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన స్టాల్ లు ఆహుతులతో కిక్కిరిసిపోయాయి.
పండుగకు హాజరైన అందరికీ తెలంగాణ డెవెలప్మెంట్ ఫోరమ్ కమ్మటి తెలంగాణ వంటకాల భోజనాన్ని ఉచితంగా అందించారు. మంజువాణి కల్చరల్ లీడ్, తన బృందంతో మహిషాసుర మర్ధిని నృత్య రూపకాన్ని ప్రదర్శించి ఆహుతులని అబ్బుర పరిచారు. నవ్య ఆలపాటి తన బృందంతో తెలంగాణ పల్లె పదాల మెడ్లీ నృత్యాన్ని ప్రదర్శించారు. అందరికి ఆనందాన్ని అందించారు.
స్పాన్సర్లు, వాలంటీర్లు, కోఆర్డినేటర్ల కుటుంబాలు, మీడియా మిత్రుల అవిశ్రాంత కృషి లేకుండా ఈ కార్యక్రమం విజయవంతమయ్యేది కాదు.
విశ్వవ్యాప్తంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలుగు వారందరికీ, వాషింగ్టన్ డి.సి బతుకమ్మ పండుగకు హాజరైన అందరికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ వాషింగ్టన్ డిసి వనితా టీమ్ నాయకులు కవితా చల్లా, వినయ సూరనేని, కల్పనా బోయిన్పల్లి, శ్రీకళ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ పండుగ విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన మంజువాణి, శివాని,మంజు గంగ, జీనత్, నవీన్ చల్ల, పున్నం జొన్నల, అనిల్ కేసినేని, రామ్మోహన్ సూరనేని, అమర బొజ్జ, అశ్విని, పవన్, కరుణాకర్ చాట్ల , రాధికా ముస్క్యూ , శ్వేత ఇమ్మడి, మల్లారెడ్డి, నరేందర్, షర్మిల ఇంకా చాలా మంది వలంటీర్ లకి కవిత చల్ల, వినయ సూరనేని, కల్పనా బోయిన్పల్లి, శ్రీకళ కృతజ్ఞతలు తెలిపారు.