ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకని సీపీఐ నారాయణ ప్రశ్న
బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి గానీ, ప్రజలకు గానీ ఏమైనా ఉపయోగం ఉందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ‘ఈ షో ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది? ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయి? ఇలాంటి బూతుల ప్రపంచం వందల కోట్ల వ్యాపారానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ప్రోగ్రాంలో వాళ్ల కొట్లాటలు అనైతికంగా ఉన్నయ్’ అని నారాయణ శనివారం వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ షోపై తాను కోర్టులో పిల్ దాఖలు చేశానని, న్యాయ వ్యవస్థ కూడా తనకు సాయం చేయట్లేదన్నారు. బిగ్ బాస్ ప్రోగ్రాంకు పర్మిషన్ ఇవ్వడం మంచిదికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అరికట్టాలని సూచించారు.