BREAKINGNEWS 🔴 PRIME TODAY
చిన్నారి తల్లిని చిదిమేసిన ఆ మానవ మృగం ఇక లేదు. సంచలనం సృష్టించిన సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈనెల 9న సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఆటోలు, బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టారు. సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుండగానే స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో మృతదేహాన్నిగుర్తించారు. మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధారించారు. అయితే సంఘటనకు సంబంధించి ఎప్పుడు జరిగింది ఏ ట్రైన్ కింద పడ్డాడు అనే అంశాలతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.
