Hyderabad: 180 people from 3 countries, 13 states, 59 towns, cities and 74 schools are participating in the 15th Indian National Memory Championship 2024 to be held in Hyderabad on October 20. On the occasion of Indian National Memory Championship 2024, Dr. P Srinivas Kumar, Chief Incharge of Championships from Indian Memory Sports Council held a press meet at Somajiguda Press Club today.
హైదరాబాద్: అక్టోబర్ 20న హైదరాబాద్‌లో జరగనున్న 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 పట్టణాలు, నగరాలు, 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొంటున్నారు. ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024 సందర్భంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి ఛాంపియన్‌షిప్‌లకు చీఫ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు & 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొంటున్నారని, ఇందులో 10 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వారు పాల్గొంటున్నారని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ మీడియాకు తెలిపారు.
హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 5 మంది విద్యార్థులు, ASWA ఫౌండేషన్ నుండి 5 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం విశేషం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి స్పాన్సర్‌లు తమ ఈవెంట్‌కు మద్దతు ఇచ్చి సహాయపడాలని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ అభ్యర్థించారు.
ఈ ఛాంపియన్స్‌కి టైటిల్ స్పాన్సర్‌గా ముందుకి వచ్చిన ViralPe Sales and Services చైర్మెన్ Srinivasan మాట్లాడుతూ.. బిజినెస్‌కి చాలా కష్టమైన సేల్స్‌ని సులభతరం చెయ్యడానికి ఎలాగైతే ViralPe Sales and Services ని తీసుకురాబోతున్నామో, అలాగే చదివింది చాలా సులభతరంగా గుర్తుండడానికి ఈ మెమోరీ టెక్నిక్స్ చాలా సహాయపడతాయని, విద్యార్థులందరికీ ఈ టెక్నిక్స్ ని చేరవేయాలనే డాక్టర్ శ్రీనివాస్ కుమార్ ఆలోచన మాకు నచ్చి వీరికి స్పాన్సర్ చెయ్యడానికి ముందుకు వచ్చామని, ఇలాగే మరి కొంత మంది Sponsors ముందుకు వస్తే ఎంతో మంది విద్యార్థులకి సహాయం చెయ్యొచ్చని తెలిపారు.
అలాగే ఈ December లో జరగబోయే world memory championship లో పోటీ పడగల సత్తా మన దేశంలో చాలా మందికి ఉంది అని, కానీ అక్కడికి వెళ్ళి పాల్గొనడానికి కావలసిన ఆర్థిక స్తోమత లేక వెళ్ళలేకపోతున్నారని, ప్రభుత్వం, స్పాన్సర్స్ ముందుకి వస్తే మన విద్యార్థులు Turkey లో జరగబోయే world memory championship లో పాల్గొని సత్తా చాటగలరని తెలిపారు.
Indian Memory Sports Council Championships ki Chief In Charge అయిన Dr. P Srinivas Kumar మాట్లాడుతూ, JNTUH నుండి Biotechnology లో Ph.D చేసిన తాను ఈ memory sport ను దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతిభ గల వారిని కనుగొని శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని, తద్వారా ఒక రోజు భారతీయుడు ప్రపంచ మెమరీ ఛాంపియన్‌షిప్ గెలుపొందడం మనం చూడాలి అని, దానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని అని కోరారు.