నిరసన సెగ: మంత్రి మల్లారెడ్డిని అడుగడుగునా అడ్డుకున్నారు

మేడ్చ‌ల్‌: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. సొంత నియోజ‌క‌వ‌ర్గం మేడ్చల్ లో అడుగడుగునా మంత్రి మల్లారెడ్డిని ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని మంత్రి మల్లారెడ్డిని నిలదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండలం బాబాగూడా, బొమ్మ రాసిపేట, పొన్నాల గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర […]

Continue Reading

గవర్నర్‌కు లేఖ – సుకేష్ ఎవరో తెలియద‌న్న కేటీఆర్

రూ. 200 కోట్ల మనీలాండారింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్‌ చంద్రశేఖర్‌.. తనపై చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు తనకు సుకేష్ ఎవరో కూడా తెలియదన్నారు. తానూ ఎప్పుడూ కూడా అతని గురించి వినలేదన్న కేటీఆర్.. అతడు చేసిన హాస్యాస్పదమైన ఆరోపణలు మీడియా ద్వారానే తన దృష్టికి వచ్చాయన్నారు. సుకేష్ వ్యాఖ్యలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అతడు చేసినవి మతిలేని ఆరోపణలని […]

Continue Reading

మేడ్చ‌ల్‌ కాంగ్రెస్‌లో జోష్ – వ‌జ్రేష్ యాద‌వ్ దూకుడు

మేడ్చ‌ల్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌లో జోష్ మీదుంది. నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొద‌లైంది. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. రేవంత్ త‌న స‌న్నిహితుడైన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చ‌ల్‌ నియోజ‌వ‌ర్గంలో నిత్యం ప్ర‌జల్లో ఉంటూ పార్టీని బ‌లోపేతం దిశ‌గా తీసుకెళ్తున్నాడు. తాజాగా బోడుప్పల్-పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో SNDP పనులు ఇంకెన్నాళ్లు అంటూ తోటకూర వజ్రేష్ యాదవ్ నిరసన తెలుపుతూ చేపట్టిన దీక్ష కార్యక్రమం […]

Continue Reading

బెజ‌వాడ ఎంపీ టికెట్ ఈసారి ‘చిన్ని’కేనా?

బెజ‌వాడ రాజ‌కీయాలు హీటెక్కాయ్. ఇటీవ‌ల టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ‘నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నేను ఏ పార్టీకి చెందినవాణ్ని కాదు’అంటూ బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రీసెంట్‌గా కేశినేని నానితో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన నాని సొంత పార్టీకి వ్య‌తిరేకంగా కామెంట్స్ […]

Continue Reading

కేసీఆర్ మట్లాడిన భాష ఎక్కడా వాడకూడనిది

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటతీరు సరిగా లేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్ మండిపడ్డారు. రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తూ ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు, ఆయన వాడిన పదజాలం బాగోలేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. అహంకారపూరిత భాషను రోజూ వాడే వ్యక్తి కొత్త రాజ్యాంగం రాస్తే అది ఎట్లుంటదో, అది ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో ఊహించుకోండన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, […]

Continue Reading

కేసీఆర్ కొత్త రాజ్యాంగం.. రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నడుమ వాగ్వాదం

భారత రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమేనంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై రాజ్యసభలోనూ రగడ చోటుచేసుకుంది. కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారని రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త రాజ్యాంగం ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. అది ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు […]

Continue Reading

కేసీఆర్ గొప్ప తనం కోసం ఏపీని అలా అనేయాలా శ్రీనివాస్ గౌడ్?

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనాన్ని.. ఆయన పెద్ద మనసును గొప్పగా చెప్పుకునే వేళ.. ఏపీని చిన్నబుచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ నీయాంశం గా మారాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఆయన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి […]

Continue Reading

నిలువెత్తు రాజకీయ శిఖ‌రం పీవీ

చరిత్రను సృష్టించడం.. ఆ చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్యేకంగా రాసుకున్న గొప్ప నాయకుడు పీవీ నర్సింహారావు. తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో కనిపించే పీవీ దేశ రాజకీయాలను, ఆర్థిక స్థితిగతులను మలుపు తిప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగువాడు. తెలంగాణ ముద్దు బిడ్డ. ఎన్నో వివాదాలను, సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న మహా మేధావి. దివాలా పరిస్థితికి చేరిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యుడు. పూర్తి మెజారిటీ లేకున్నా […]

Continue Reading

National farmers day: ఆకు ప‌చ్చ‌ని చంద‌మామాల‌కు ఓ రోజు

రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా క‌డుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వ‌ల్లే. అలాంటి రైతు ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డినా, శ్ర‌మ అంతా చేతికి ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం లేదు. అయినా స‌రే రైతులు మాత్రం అటు ప్ర‌కృతి మీద‌, ఇటు ప్ర‌భుత్వం మీద భారం వేసి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. డిసెంబ‌ర్ […]

Continue Reading