కోమటిరెడ్డి బ్రదర్స్.. సీన్ రివ‌ర్స్ అవుతోందా?

ఆ సోదరులు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. యూత్ విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.. గతంలో ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు కొన్ని తప్పటడుగులు వల్ల అధిష్ఠానం ఆగ్రహానికి గురైన వాళ్ల రాజకీయ కెరీర్ ముగింపు దిశగా సాగుతుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. పార్టీలో సీనియర్ నాయకులుగా మంచి భవిష్యత్ ఉన్న నాయకులైన ఈ సోదరులు ఇలా వ్యవహరించడం ఏమిటా? అని […]

Continue Reading

మోడీజీ ‘గొప్ప‌త‌నం’ తెలిపే లిస్టు ఇదిగో..

అప్పు చేసి పప్పు కూడు అంటారు. కానీ అప్పు చేసినా ఇప్పుడు దేశంలో బుక్కెడు బువ్వ దొరకదు అంటున్నారు. గత కాంగ్రెస్ పాలనకు.. నేటి మోడీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఆర్నెళ్లకో ఏడాదికో పెట్రోల్ రేటు పెంచితే రోడ్డెక్కి నానా యాగీ చేసే ప్రతిపక్షాలను ప్రజలను చూశాం.. కానీ ఇప్పుడూ మోడీ సార్ రోజు పెట్రోల్ వాతలు పెడుతుంటే చేష్టలుడి చూస్తున్నాం.. ప్రశ్నించినవాడిని ‘దేశద్రోహి’ అని ముద్ర […]

Continue Reading

ఏడున్నరేళ్ల తర్వాత కూడా ఇవేం మాటలు కేసీఆర్?

అధికారం చేతికి వచ్చినంతనే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. అధికారాన్ని చేపట్టి ఏడున్నరేళ్లు అవుతున్నప్పుడు మాత్రం కచ్ఛితంగా అంతో ఇంతో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పటికి ఏమీ చేయకపోగా.. ఎదురుదాడి చేస్తే మాత్రం దాన్ని ప్రశ్నించాల్సిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇదే రీతిలో ఉందని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత భట్టి విక్రమార్క సంధించిన పలు ప్రశ్నలకు బుల్ డోజ్ చేయటం ద్వారా.. గతాన్ని ఎత్తి చూపించటం ద్వారా […]

Continue Reading

కాన్షీరామ్ బాట‌లో వెళితే బ‌హుజ‌న రాజ్యాధికారం సాధ్య‌మే

గర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన నిలువెత్తు రాజ‌కీయ శిఖ‌రం తరతరాల బానిసత్వంలో మగ్గిపోయిన వారి మాటకు విలువ లేదు, తనువుకు తాహతు లేదు, అంతిమంగా బ‌తుకుకి భరోసా లేదు. మహాత్మా జ్యోతిబాఫూలే సామాజిక సమానత్వం, సామాజిక ప్రజాస్వామ్యం అను నినాదాలతో దళిత, బహుజన వర్గాలను సంఘటితం చేసి, విద్య ద్వారా జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం ద్వారా చైతన్యవంతులమై సమాజగతి తెలుసుకొని మన స్థితిని మార్చుకునే అవకాశం ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ‌హుజ‌నులకు భావోద్వేగం అయ్యాడు […]

Continue Reading

నక్షత్రం వేణు​ ‘అరుగు’ కథల పుస్తకావిష్కరణ

హైద‌రాబాద్ (ర‌వీంధ్ర‌భార‌తీ): తెలంగాణ ఎన్నారై, రచయిత నక్షత్రం వేణుగోపాల్​ రాసిన ‘అరుగు’ కథల పుస్తకాన్ని హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య రక్షణ కోసం జంట నగరాల కవులకు అందిస్తున్న ప్రోత్సాహం పట్ల.. కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కథలు రాసే రచయితలు చాలా అరుదుగా ఉన్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు డాక్టర్ నందినీ సిధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, […]

Continue Reading

పోడు..‘గోడు’ వినిపించ‌దా?

స్వామి ముద్దంఎడిటోరియ‌ల్ PRIME TODAY తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు ఆ అడవిపై హక్కు కోసం ఎదురు చూస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పోడుభూములపై పాడు దందా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో భూముల అంశం కూడా ఉంది. తెలంగాణలో భూ చట్టాలు అమలు అవుతాయని, పోడు భూములపై పట్టా హక్కు పొందాలని పోడు సాగుదారులు […]

Continue Reading

తెలంగాణ జాగృతి పాటలో తెలంగాణ జాగృతమేదీ?

తెలంగాణ జాగృతి పాటలోతెలంగాణ జాగృతమేదీ? మన బతుకమ్మలో మనమేదీ..తెలంగాణ యాసబాసల గోసేది?బొట్టు ఏదీ? బోనం ఏదీ? మా పల్లె ఏది మా ముల్లె ఏది..మా జనమేరీ? మా ఘనులేరీ? జానపదాల కిల్లాలోకికిరాయి సంగీతకారులా? ఎంతో దృక్పథమున్న నేలపైకిపరాయి దర్శకులా? ఆటపాటల కోటలోకిముంబై కొరియోగ్రఫీనా? తమిళ సంగీతంకేరళ దర్శకత్వంముంబై నృత్యంఆంధ్ర నాట్యం..తో నా బతుకమ్మ పాటా? నా బాసేదినా యాసేదినా గుండె గోసేది? నేనెక్కడ ??? నా కవిత్వమెక్కడనా కావ్యమెక్కడ?నా నృత్యమెక్కడ?నా నాట్యమెక్కడ?నా జానపదమెక్కడ? బతుకమ్మ పాటలోనా బతుకేదే […]

Continue Reading

తెలంగాణ రాజ‌కీయాల్లో అల‌జ‌డిరేపుతోన్న బీసీ వాయిస్

తెలంగాణ రాజకీయాల్లో మ‌రో అల‌జ‌డి మొద‌లైందా? బీసీ ఉద్య‌మం తీవ్ర‌రూపం దాల్చ‌బోతోందా? కేంద్ర ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారబోతున్నారా? ప‌రిస్థితులు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. జ‌నాభాలో అత్య‌ధిక శాతం ఉన్న బీసీలు ప్ర‌భుత్వంపై క‌న్నెర్ర చేస్తున్నారు. బీసీ కులాలపై జ‌రుగుతోన్న‌ అణిచివేత‌కు నిర‌స‌న‌గా డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ ఆధ్వ‌ర్యంలో కొత్త ఉద్య‌మం మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది. స‌మాజంలో అత్య‌ధిక శాతం ఉన్న బీసీల‌కు అడుగ‌డుగున అన్యాయం జ‌రుగుతోందంటూ బీసీ కులాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి. అఖిల ప‌క్ష స‌మావేశాలు ఇప్ప‌టికి […]

Continue Reading

రేవంత్ చెప్పిందే చేశారు.. కాంగ్రెస్ అభ్యర్థి ఖ‌రారు.. ఎవ‌రీ బల్మూరి వెంకట్‌..?

హుజూరాబాద్‌ (huzurabad) పోరులోలో డీకొట్టెందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరి పోరాటం కొనసాగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికపై ఊగిసిలాట కొనసాగింది. రెండు పార్టీలకు దీటుగా ఉండే అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించినా..పరిస్థితులు మాత్రం అనుకూలించలేక పోయాయి. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వెంకట్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా […]

Continue Reading

బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. ఎందుకీ నిర్ణ‌యం?

గత కొద్ది రోజులుగా జైలు జీవితం గడుపుతున్న తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింత‌పండు నవీన్ బీజేపీలో చేరుతున్నట్టు క్యూ న్యూస్ ప్రకటించింది. మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. మరోవైపు ఆయన్ను జైలు నుండి విడుదల చేయించాలని ఆయన భార్య సైతం ప్రధాని మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షాకు ఈమెయిల్ ద్వారా వేడుకుంది. అయితే, గత కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యుడు లక్ష్మికాంత శర్మ పెట్టిన […]

Continue Reading