కేసీఆర్ కొత్త రాజ్యాంగం.. రాజ్యసభలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నడుమ వాగ్వాదం

భారత రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హీట్ రాజేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమేనంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై రాజ్యసభలోనూ రగడ చోటుచేసుకుంది. కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారని రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే.కేశవరావు చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త రాజ్యాంగం ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. అది ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు […]

Continue Reading

కేసీఆర్ గొప్ప తనం కోసం ఏపీని అలా అనేయాలా శ్రీనివాస్ గౌడ్?

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనాన్ని.. ఆయన పెద్ద మనసును గొప్పగా చెప్పుకునే వేళ.. ఏపీని చిన్నబుచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ నీయాంశం గా మారాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఆయన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి […]

Continue Reading

నిలువెత్తు రాజకీయ శిఖ‌రం పీవీ

చరిత్రను సృష్టించడం.. ఆ చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. అలాంటి చరిత్రను తనకంటూ ప్రత్యేకంగా రాసుకున్న గొప్ప నాయకుడు పీవీ నర్సింహారావు. తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో కనిపించే పీవీ దేశ రాజకీయాలను, ఆర్థిక స్థితిగతులను మలుపు తిప్పారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి తెలుగువాడు. తెలంగాణ ముద్దు బిడ్డ. ఎన్నో వివాదాలను, సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న మహా మేధావి. దివాలా పరిస్థితికి చేరిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యుడు. పూర్తి మెజారిటీ లేకున్నా […]

Continue Reading

National farmers day: ఆకు ప‌చ్చ‌ని చంద‌మామాల‌కు ఓ రోజు

రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా క‌డుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు వ‌ల్లే. అలాంటి రైతు ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డినా, శ్ర‌మ అంతా చేతికి ద‌క్కుతుంద‌నే న‌మ్మ‌కం లేదు. అయినా స‌రే రైతులు మాత్రం అటు ప్ర‌కృతి మీద‌, ఇటు ప్ర‌భుత్వం మీద భారం వేసి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. డిసెంబ‌ర్ […]

Continue Reading

కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అమిత్ షా కంటే ముందే బయటపెట్టిన రేవంత్.. అలాగే జరుగుతుందా ?

నిన్న బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు.. ఆయనతో కీలక సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీలో ఆయన ఏయే అంశాల గురించి పార్టీ నేతలో మాట్లాడారనే దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే సీఎం కేసీఆర్.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు […]

Continue Reading

జాతీయ పార్టీలోకి తెలంగాణ ప్రాంతీయ పార్టీ విలీనం

కేసీఆర్‌కు చెక్ పెట్టే ఆయుధంకాంగ్రెస్‌లోకి ఉద్య‌మ‌నేత చెరుకు సుధాక‌ర్‌తెలంగాణ ఇంటి పార్టీ విలీనం తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార‌బోతోందా? కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైందా? ఉద్య‌మ నేతల‌ను పార్టీలో చేర్చుకుంటూ.. కాంగ్రెస్ రాజ‌కీయ అల‌జ‌డి సృష్టించ‌బోతోందా? తాజా ప‌రిణ‌మాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ పోరాటయోధుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్న‌ట్టు స‌మాచారం. నిస్తేజంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు నూత‌నోత్సాహం నింపేందుకు ఆ […]

Continue Reading

కమలంలో క‌య్య‌మేనా? -బండి సంజయ్ Vs ఈటల రాజేందర్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీలోనూ ముసలానికి దారితీశాయి. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో నిలవగా, ఆయనకు మద్దతిస్తామని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అసలీ ఎన్నికల్లో బీజేపీ తటస్థంగా ఉంటుందని చెప్పారు. కీలక నేతలు ఇద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు […]

Continue Reading

KCR కేబినెట్​లోకి ఆ నలుగురు!

బండ ప్రకాశ్​, కవిత, కడియం, వెంకట్రామిరెడ్డికి చాన్స్​కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా గుత్తా, వైస్‌‌ చైర్మన్‌‌గా రమణకు అవకాశంరాష్ట్ర కేబినెట్​లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కనుందనే దానిపై టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. హుజూరాబాద్​ బై ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్​ దీనిపై ఫోకస్​ పెట్టారు. కులాల లెక్కలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నలుగురిని కేబినెట్​లోకి తీసుకునే చాన్స్​ ఉంది. ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​, : ఈటల […]

Continue Reading

టీఆర్‌‌ఎస్‌లో ఉద్యమకారులకు గౌరవమే కాదు.. చోటు కూడా లేదు

కరీంనగర్: టీఆర్‌‌ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముసలం రేపాయి. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాల్లో ఒక్కసారిగా దాదాపు 18 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు వచ్చినా.. తమ అవకాశం రాకపోవడంతో ఆశలు పెట్టుకుని భంగపడిన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచందర్‌‌రావు, కరీంనగర్‌‌ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామాలు ప్రకటించారు. ‘‘మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో […]

Continue Reading

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌

కులగణన డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నాం: సీఎం జగన్‌ అమరావతి: 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన […]

Continue Reading