Huzurabad exit poll results: ఆ పార్టీదే స్ప‌ష్టమైన గెలుపు

Latest News Political News

తెలంగాణలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినదిగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓట్ల సంగ్రామం ముగిసింది. అధికారికంగా ఎన్నిక ఫలితాలు నవంబర్ 2న వెలవడనుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలవడ్డాయి. సాయంత్రం 7 తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువ‌రించాయి. ఇందులో న్యూస్ ఛాన‌ల్ ‘ప్రైమ్ టుడే’ ఎగ్జిట్ పోల్స్‌ను విడుద‌ల చేసింది.

బీజేపీ –        46 శాతం
టీఆర్‌ఎస్ – 36 శాతం
కాంగ్రెస్ –    13 శాతం
ఇతరులు –   5 శాతం

‘ప్రైమ్ టుడే’ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మొగ్గు కనిపించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య 7 నుంచి 9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని, మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం మాత్రమేనని ‘ప్రైమ్ టుడే’ ఫ‌లితాలు తెలిపాయి. హుజూరాబాద్‌లో ఎన్నికల యుద్ధం రెండు పార్టీల మధ్యే జరిగిందని తెలిపింది. కాంగ్రెస్ మూడో స్థానానికే ప‌రిమితం కానుందని తెలిపింది. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో సానుకూలతగా మారాయని, ఈటల వ్యక్తిత్వం కూడా ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టిందని ‘ప్రైమ్ టుడే’ అభిప్రాయపడింది.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల 24వేల ఓట్ల తేడాతో విజయం సాధించొచ్చని, బీజేపీ 51శాతం ఓట్లు, టీఆర్ఎస్ 42శాతం ఓట్లు సాధిస్తాయని ‘ప్రైమ్ టుడే’ అంచనా వేసింది. అనూహ్యరీతిలో ఈటల సొంత మండలం కమలాపూర్ లో, ఇల్లంతకుంటలో టీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు పడతాయని, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో మెజార్టీతోనే ఈటల గెలుస్తాడని త‌మ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయ‌ని తెలిపింది.

ఇదే ‘ప్రైమ్ టుడే’ సంస్థ రెండు నెల‌ల క్రితం ఆగ‌స్టు చివ‌రి వారంలో నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా బీజేపీకే ఆధిక్యం ల‌భించింది. ఆ ఫ‌లితాలు కింది విధంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *