పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల థియేటర్స్‌లో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం జూలై 11 నుంచి ప్రముఖ డిజిటల్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటమి ఎదురైతే నేటి యువత తట్టుకోలేక జీవితానికి ముగింపు పలికేస్తోంది. అలాంటి వారికి సమాధానమే ‘6 జర్నీ’. యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో పాటు దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రం.
లవ్, యాక్షన్, మిస్టరీ ..ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో 6జర్నీ మూవీని రూపొందించారు మేకర్స్. థియేటర్స్‌లో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది యువతీ యువకులు వెకేషన్‌కు అడవికి బయలుదేరుతారు. కానీ వారి ప్రధాన లక్ష్యం వేరుగా ఉంటుంది. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్న వారూ ఎవరూ ఊహించని విధంగా తీవ్రవాదుల చేతికి చిక్కుతారు. ఆ సమయంలో తీవ్రవాదులు అక్కడేం చేస్తుంటారు.. వారికి ఎవరు సహాయం చేశారనే పాయింటే ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్ బసీర్ సినిమాను చక్కటి కథాంశంతో.. నిర్మాత రవిప్రకాష్ రెడ్డి చక్కటి ప్లానింగ్‌తో సినిమాను రూపొందించారు. థియేటర్స్‌లో అలరించిన ఈ చిత్రం జూలై 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి రానుంది.
