PRIME TODAY స‌ర్వే: 2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా?

బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? మోడీ మళ్లీ గెలుస్తాడా? అన్న విషయాలపై ‘ప్రైమ్‌టుడే’ పోల్ నిర్వహించింది. […]

Continue Reading

కదం తొక్కిన ప‌సుపు, చెరుకు రైతులు

మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, పసుపు పంటకు రూ.1500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్​చేస్తూ జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. మంగళవారం మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి వేలాది మంది రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ దగ్గర నేషనల్ హైవేపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు నిజాం షుగర్స్ ను […]

Continue Reading

కుల జన గణన చేయలేని పాలకులు రాజీనామా చేయాలి

ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కుల జన గణన చేయలేని కేంద్ర పాలకులు వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని గౌడ సంఘం కార్యాలయంలో కుల గణన పై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు పులి గణేష్ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా ప్రభంజన్ కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. దేశంలో మొత్తం కుల గణన […]

Continue Reading

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఆ పార్టీ ఎందుకు ఒంటరిని చేసింది?

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి..? ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలో నిలిపింది. పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు కొందరు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఒక్క ముఖ్య నేత కూడా అటువైపు చూడటం లేదు. ఇప్పుడు అక్కడ అభ్యర్థి వెంకట్ హుజురాబాద్‌లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంతకూ కాంగ్రెస్ సీనియర్లు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆటకు ముందే ఎందుకు సైడ్ […]

Continue Reading

కోమటిరెడ్డి బ్రదర్స్.. సీన్ రివ‌ర్స్ అవుతోందా?

ఆ సోదరులు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. యూత్ విభాగం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.. గతంలో ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు కొన్ని తప్పటడుగులు వల్ల అధిష్ఠానం ఆగ్రహానికి గురైన వాళ్ల రాజకీయ కెరీర్ ముగింపు దిశగా సాగుతుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. పార్టీలో సీనియర్ నాయకులుగా మంచి భవిష్యత్ ఉన్న నాయకులైన ఈ సోదరులు ఇలా వ్యవహరించడం ఏమిటా? అని […]

Continue Reading

మోడీజీ ‘గొప్ప‌త‌నం’ తెలిపే లిస్టు ఇదిగో..

అప్పు చేసి పప్పు కూడు అంటారు. కానీ అప్పు చేసినా ఇప్పుడు దేశంలో బుక్కెడు బువ్వ దొరకదు అంటున్నారు. గత కాంగ్రెస్ పాలనకు.. నేటి మోడీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఆర్నెళ్లకో ఏడాదికో పెట్రోల్ రేటు పెంచితే రోడ్డెక్కి నానా యాగీ చేసే ప్రతిపక్షాలను ప్రజలను చూశాం.. కానీ ఇప్పుడూ మోడీ సార్ రోజు పెట్రోల్ వాతలు పెడుతుంటే చేష్టలుడి చూస్తున్నాం.. ప్రశ్నించినవాడిని ‘దేశద్రోహి’ అని ముద్ర […]

Continue Reading

ఏడున్నరేళ్ల తర్వాత కూడా ఇవేం మాటలు కేసీఆర్?

అధికారం చేతికి వచ్చినంతనే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. అధికారాన్ని చేపట్టి ఏడున్నరేళ్లు అవుతున్నప్పుడు మాత్రం కచ్ఛితంగా అంతో ఇంతో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పటికి ఏమీ చేయకపోగా.. ఎదురుదాడి చేస్తే మాత్రం దాన్ని ప్రశ్నించాల్సిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇదే రీతిలో ఉందని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత భట్టి విక్రమార్క సంధించిన పలు ప్రశ్నలకు బుల్ డోజ్ చేయటం ద్వారా.. గతాన్ని ఎత్తి చూపించటం ద్వారా […]

Continue Reading

కాన్షీరామ్ బాట‌లో వెళితే బ‌హుజ‌న రాజ్యాధికారం సాధ్య‌మే

గర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన నిలువెత్తు రాజ‌కీయ శిఖ‌రం తరతరాల బానిసత్వంలో మగ్గిపోయిన వారి మాటకు విలువ లేదు, తనువుకు తాహతు లేదు, అంతిమంగా బ‌తుకుకి భరోసా లేదు. మహాత్మా జ్యోతిబాఫూలే సామాజిక సమానత్వం, సామాజిక ప్రజాస్వామ్యం అను నినాదాలతో దళిత, బహుజన వర్గాలను సంఘటితం చేసి, విద్య ద్వారా జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం ద్వారా చైతన్యవంతులమై సమాజగతి తెలుసుకొని మన స్థితిని మార్చుకునే అవకాశం ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ‌హుజ‌నులకు భావోద్వేగం అయ్యాడు […]

Continue Reading

నక్షత్రం వేణు​ ‘అరుగు’ కథల పుస్తకావిష్కరణ

హైద‌రాబాద్ (ర‌వీంధ్ర‌భార‌తీ): తెలంగాణ ఎన్నారై, రచయిత నక్షత్రం వేణుగోపాల్​ రాసిన ‘అరుగు’ కథల పుస్తకాన్ని హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య రక్షణ కోసం జంట నగరాల కవులకు అందిస్తున్న ప్రోత్సాహం పట్ల.. కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కథలు రాసే రచయితలు చాలా అరుదుగా ఉన్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు డాక్టర్ నందినీ సిధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, […]

Continue Reading

పోడు..‘గోడు’ వినిపించ‌దా?

స్వామి ముద్దంఎడిటోరియ‌ల్ PRIME TODAY తరతరాలుగా అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు ఆ అడవిపై హక్కు కోసం ఎదురు చూస్తున్నారు. సాంప్రదాయ బద్దంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూములపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పోడుభూములపై పాడు దందా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల్లో భూముల అంశం కూడా ఉంది. తెలంగాణలో భూ చట్టాలు అమలు అవుతాయని, పోడు భూములపై పట్టా హక్కు పొందాలని పోడు సాగుదారులు […]

Continue Reading