ఓవైపు సినిమాలు..మరోవైపు పాలిటిక్స్ తో బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా అవుతున్నాడు. ఇటీవలే పవన్ ఇన్ స్టాగ్రామ్లో ఖాతా తెరిచాడు. దీంతో పవర్ స్టార్ కు అక్కడ కూడా భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా 2.4 మిలియన్ల ఫాలోవర్లు వచ్చాడు. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ పోస్ట్ చేశాడు.
ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ.. చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తలతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అని పోస్ట్ చేశాడు. టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రెటీలతో కలిసి దిగిన ఫోటోలను ఓ వీడియో రూపంలో పంచుకున్నాడు. మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ.. అంటూ పవన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూన్ 4న పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వెరిఫైడ్ టిక్ లభించింది. ట్విట్టర్ అకౌంట్‌కు పెట్టిన ప్రొఫైల్ ఫొటోనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పిక్‌గా పెట్టుకున్నాడు. ట్విట్టర్‌లో ఉన్న ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్ అనే స్లోగన్‌నే ఇన్‌స్టాలోనూ యాడ్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే బ్రో మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు సుజీత్‌తో ఓజీ, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ లో నటిస్తున్నాడు. క్రిష్‌తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.
https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==