PRIME TODAY సర్వే ఫలితాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమంగా జోరు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో చురుకుదనం, ప్రజల్లో కదలిక పెంచే ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎండగట్టే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కదలికలు ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి అవ్వడం, కేసీఆర్ సంగతి తేల్చడం అయితే, రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడని అనుకోవచ్చా? అని అడిగిన ప్రశ్నకు రేవంత్ ఊహించని సమాధానం ఇచ్చారు. పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా కూడా తాను అందరికంటే ముందే మనస్పూర్తిగా మద్దతు తెలుపుతానని రేవంత్ ప్రకటించారు. పార్టీలో సీనియర్‌లకు కాదని, తనకు పీసీసీ ఇచ్చారని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ఎవరినీ నిర్ణయించినా కూడా అందరి కంటే ముందు తానే ప్రపోజల్ చేస్తానని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ నుంచి పదవుల అవకాశం ఉన్నా కూడా అటువైపు వెళ్లలేదని, అధికారం తనను టెంప్టు చేయదని, రేవంత్ అంటే ఏంటో ప్రజల ముందు నిరూపించుకుంటానన్నారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే ఉంటాననిగానీ, పోటీ పడతానని గానీ రేవంత్ ప్రకటించలేదు.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి అని మీరు భావిస్తున్నారు? అనే ప్రశ్నను అన్‌లైన్ వేదికగా ఓ సర్వే నిర్వహించింది ప్రైమ్ టుడే. ఈ సర్వే ఫలితాల్లో అత్యధిక శాతం రేవంత్ రెడ్డికే పోలింగ్ నమోదైంది. టీ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డియే సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. రేవంత్ తర్వాత స్థానంలో సీతక్కకు 15 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత కోమటిరెడ్డికి 5 శాతం, మధుయాష్కీకి 3 శాతం, జానారెడ్డికి 3 శాతం ఓట్లు నమోదయ్యాయి.
ఎప్పటికప్పుడు ఖచ్చితమైన పొలిటకల్ సర్వే ఫలితాల కోసం, పొలిటికల్ అనాలిసిస్ కోసం ప్రైమ్‌టుడే తెలుగు ఛానల్‌ను చూస్తూనే వుండండి.