నిరుద్యోగ భ‌రోసా యాత్ర షురూ

Uncategorized

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిర్యుద్యోగ బరోసా యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభ‌మైంది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ఈ యాత్ర‌ను ప్రారంభించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుతవ్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లీ ప్రేమను చూపిస్తున్నది. ఉద్యోగ నోటిికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అని అన్నారు. ఈ హత్యలన్ని ప్రభుత్వ హత్యలుగానే భావించాలని అన్నారు, ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిికేషన్లు వెయ్యాలని డిమాండ్ చేశారు, అనంతరం నిరుద్యోగ ఉద్యమ జేఏసీ ఛైర్మెన్ కల్వకుర్తి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చెయ్యాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు, అనంతరం నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్యక్షులు సందీప్ చ‌మార్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు బ్రతికుండి టీఆర్ఎస్‌ ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకుందాం అని, నిరుద్యోగులు ఎవరు భ‌రోసా కోల్పోవ‌ద్ద‌ని అన్నారు. ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ సాధించిన మనం కెసిఆర్ మేడలు వంచి ఉద్యోగాలు సాధించుకోవడం పెద్ద కష్ట తరమైనది కాదు అని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనవర్సిటీ జేఏసీ కన్వీనర్ గడ్డం వెంకటేష్, బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షులు రాకేష్ వడ్డేపల్లి, తెలంగాణ విద్యార్థిసమితి అధ్యక్షుడు రమేష్, పవన్ తదితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *