కరోనా థర్డ్ వేవ్ ఒకవైపు అంతకన్నా ప్రమాదకరంగా హుజురాబాద్ ఉపఎన్నిక. నిజంగా రెండింటికి పెద్ద తేడా ఎం లేదు ఎందుకు అంటే పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉన్న ఒక్క కార్ ఓనర్ భవిషత్ సమస్య ప్రజలది బ్రతుకు సమస్య ఇంకొకడిది ఇగో సమస్య ఇలా చెప్పుకుంటా పోతే అన్ని సమస్యలపై మాట్లాడుతారు కానీ తీర్చే నాధుడు ఉండదు. ఒకడు 10 లక్షలు అంటాడు ఇంకొకరు నా వల్లే అంటారు అసలు ఏంటి ఇది.? సామజిక విలువలు ఎక్కడ.? రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ.?
వెనకట ఒక సామెత ఉండేది “రాజుల సొమ్ము రాళ్ల పాలు అని” అది కెసిఆర్ ని చేసే ఆ సామెత పుట్టిందా అనిపిస్తది అప్పుడప్పుడు. ఉద్యోగాలు లేక యువత, జీతాలు లేక ప్రైవేట్ టీచర్లు, జాబులు పోయి కాంట్రాక్టు నర్సులు, ఫీల్డ్ అస్సిసిస్టెంట్లు, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సమస్యలు అన్నిటికి మించి రాష్ట్రానికి ఆర్ధిక భారం ఇవ్వన్నీ పక్కన పెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజలను ఎంటర్టైన్ చేసి ఓట్ల గాలం వేసేందుకు ప్రజా సమస్యలు గాలికి వదిలి వొల్లెం మాలిన ముచ్చట్లు. అసలు ఎందుకు ఇది. ఏంటి ఇది..?
నాకు తెల్సి పాలకుడు అంటే కెసిఆర్ కు ముందు తర్వాత అనే పదం వాడుకలోకి వస్తాదని అనిపిస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే ఇదివరకు పాలకులకు ఈ పాలకులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది.
అసలు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది..? ఎవరికోసంఎం వచ్చింది..? కాంగ్రెస్, టీడీపీ వాళ్లకు ఆవిష్యత హుజురాబాద్ పైనే ఎందుకు వచ్చింది. కెసిఆర్ ను అసెంబ్లీ లో ఎదురుకుంటే బాగుండేది ఈ ప్రజాక్షేత్రం బదులు. ఖర్చు కాకపోవు కదా సుమారు ఒక 500 కోట్ల రూపాయల ధనం చేతులు మారకుండ ఉండు. ప్రజలను విడగొట్టే ఒక పని జరగకపోవు.
కరోనాకు హుజురాబాద్ ఎన్నికకు తేడా ఎం లేదు ఎందుకంటే ఒకటి మనుషుల మధ్య దూరం పెంచితే ఇంకొకటి మనుషుల మనుసులను మధ్య దూరం పెంచింది. ఈ రెండు ప్రమాదకారులే.
హుజురాబాద్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త…!!!! ముఠాలు మోసుకుంటూ దొంగలొస్తున్నరు.
- By Doram Harish Yadav