- స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజలకు తెలియజేయాలి
- టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్
షాద్ నగర్: అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో మరింత దోపిడీకి గురైందని విమర్శించారు టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కేసీఆర్ సర్కార్ పాలనలో అప్పుల పాలైందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ సారధ్యంలో, టీ-పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుల అధ్యక్షతన రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంపై గురువారం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన షాద్ నగర్ లోని వరలక్ష్మీ కన్వెన్షన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మన్సూర్ అలీ ఖాన్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, టీ-పీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి పాలనను ప్రజలకు తెలియజేయడంతో పాటు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలన్నారు. తద్వారా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
BREAKINGNEWS TV & APP
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/