సర్వే హైలైట్స్
- బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈటలకు 74 శాతం మద్దతు ఉంది.
- టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత గ్రామం వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఆయనకు 50 శాతం మాత్రమే మద్దతు కనిపిస్తోంది. గతంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి లక్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ సమయంలో తమకు పనులు చేసి పెట్టలేదని ఆ గ్రామస్తులు గెల్లు శ్రీనివాస్‌పై వ్యతిరేకత చూపిస్తున్నారు. మీడియా కెమెరా ముందు పబ్లిక్ టాక్ చెబుతున్న సమయంలో టీఆర్ఎస్‌కు వేస్తామని చెప్పిన గ్రామస్తులు కొందరు.. కెమెరా ఆపేశాక.. ఈటల రాజేందర్‌కే ఓటేస్తామని మనసులో మాట చెప్పారు.
- 50వేల మందికిపైగా ఓటర్లు ఉన్న దళితుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత బంధు పథకంపై నమ్మకం ఉందని ఎక్కువ శాతం విశ్వసించగా, నమ్మకంలేదని, చేతికి వచ్చేదాక నమ్మలేమని మరికొందరు చెబుతున్నారు.
- దళిత బంధు పథకం తమకు వస్తే టీఆర్ఎస్‌కు ఓటేస్తామని దళితులు అధిక సంఖ్యలో చెబుతున్నారు.
- దళిత యువతలో అధిక శాతం తమకు దళిత బంధు పథకం వచ్చినా కూడా ఈటలకు ఓటేస్తామని చెబుతున్నారు.
- దళిత బంధు పథకం తమకు ఎందుకు ఇవ్వరంటూ వృద్ధులు కూడా అడుగుతున్నారు.
దళిత బంధు పథకం మాదిరిగానే తమకూ ఇవ్వాలంటూ బీసీ, ఓసీలు కూడా అడుతున్నారు. బీసీ, ఓసీల్లో ఉండే పేదలకు ఇవ్వడం తప్పేంటని నిరసన వ్యక్తమవుతున్నాయి. - బీజేపీ కంటే వ్యక్తిగతం ఈటలను చూసి ఓటేస్తామని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈటల బీజేపీలోకి వెళ్లడం తప్పు అనే అభిప్రాయాలు ఆయన అభిమానుల నుంచి వినిపించాయి.
నియోజకవర్గంలో కేసీఆర్‌కు, కారు గుర్తుకు ఓటేస్తామని, చెప్పిన చాలామందిలో గెల్లు శ్రీనివాస్ అంటే ఎవరో తెలియదని చెప్పారు. - 26 వేల మంది ఓటర్లు ఉన్న పద్మశాలి కులస్తులు మాత్రం ప్రభుత్వం తమకు ఇంత వరకు ఏం చేయలేదని టీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
- 22 వేల మంది ఓటర్లు ఉన్న యాదవులు మాత్రమే అధిక శాతం టీఆర్ఎస్‌పై సంతృప్తికరంగా ఉన్నారు. వారికి గొర్రెల పంపిణి చేయడమే ఇందుకు కారణం.
- 22వేలపై చిలుకు ఓటర్లు ఉన్న రెడ్డి సామాజికవర్గంలో 30 శాతం టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండగా, 35 శాతం బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మిగతా వారు కొందరు కాంగ్రెస్, మరికొందరు ఇంకా తేల్చుకోలేదు.
- 24వేలపై చిలుకు ఓటర్లు ఉన్న గౌడ సామాజికవర్గం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తికరంగా ఉంది. గౌడన్నలకు మోపెడ్‌లు టీఆర్ఎస్ సర్కార్ ఇస్తామని చెప్పిన కూడా వారిలో సంతృప్తి కనిపించడం లేదు. వీరిలో అధిక శాతం ఓట్లు ఈటలకు పడే అవకాశం ఉంది.
- 23 వేలపై చిలుకు ఓటర్లు ఉన్న ముదిరాజ్ సామాజికవర్గంలో 60 శాతం ఈటలకు అనుకూలంగా ఉంది. ఈటల సామాజిక వర్గం ఇది.
- ఇక్కడ పార్టీల కంటే వ్యక్తులే ప్రధానంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోటీ ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఉంది.
- బీజేపీకి ఇక్కడ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈటలకు స్థానికంగా ఉన్న బలమే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
- ఇక్కడ కాంగ్రెస్ ఓటుబ్యాంకు కూడా ఉంది. అయినప్పటికీ టీఆర్ఎస్‌కి-బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పాలి.
- ఏ నాయకుడిపై విశ్వాసం చూపించని వారి సంఖ్య కూడా ఉంది. కనీసం 4 శాతం మంది నోటాకు ఓటేసే అవకాశం ఉంది.
- ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అంత టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని హుజురాబాద్‌లో నియోజకవర్గంలోని స్థానికంగా విశ్లేషణలు వినిపించాయి.
🔴 PRIME TODAY సర్వే | హుజురాబాద్ ఉప ఎన్నికల సర్వే ఫలితాలు
http://primetodaytv.com/latest-news/prime-today-huzurabad-survey-results/