Telangana LRS స్పీడప్… 25 లక్షల లబ్ధిదారులకు ఊరట..!

Latest News

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంకు అనుహ్య స్పందన వచ్చింది.దీంలో లక్షల మంది భూయజమానులు ఎల్‌ఆర్ఎస్‌ కోసం ధరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొదటి విడత కొన్ని అప్లికేషన్స్‌ను క్లియర్ చేసిన అధికారులు…ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్‌ను పెండింగ్‌లో పెట్టారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఎల్ఆర్ఎస్‌ అప్లికేషన్స్‌కు మోక్షం లభించక పోవడంతో…అబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం అయింది.దీంతో సీఎం కేసిఆర్ ఎల్ఆర్ఎస్‌ అంశంపై చర్చించారు. అనంతరం వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ఎల్‌ఆర్ఎస్ అప్లికేషన్స్‌ను పదిహేను రోజుల్లోగా పరీశీలించాలని చెప్పారు. పరీశీలన కోసం ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అప్లికేషన్స్‌ను రెండు దశల్లో క్లియర్ చేయాలని అధికారులకు అదేశాలను వెళ్లాయి.

ఈ ప్రక్రియ అంతా రెండు విడతల్లో ముగించాలని నిర్ణయించారు.. మొదటి విడతలో గ్రామాలతోపాటు సర్వే నంబర్ల వారిగా వేరు చేసి వాటిని విభజించనున్నారు. అనంతరం అధికారులు వాటిని స్వయంగా పరీశీలించి, ఓకే చెప్పనున్నారు. ఇక అధికారుల బృందంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కేవలం పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. అనంతరం రెగ్యులరైజ్ చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సీఎం చెప్పారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యెందుకు కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

ఎల్ఆర్ఎస్ సమస్య పరిష్కారం అయితే… భూ కోనుగోలుదారులకు ఉపశమనం కల్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎలాంటీ ఇబ్బందులు లేకుండా బ్యాంకు ఆర్ధిక లావాదేవిలతో పాటు భవిష్యత్‌లో ఇంటి నిర్మాణాలు, ఇతర కట్టడాలకు అతి సులువుగా అనుమతులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఆశించినట్టుగా ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *