హైదరాబాద్ (ప్రైమ్ టుడే ప్రతినిధి): దళితులను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ మరో చర్చకు తెరలేపింది..ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి బీజేపిక చెక్ పెట్టేందుకు మరో వ్యుహ్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని కేంద్రానికి లేఖ రాశారు ఆపార్టీ నేతలు.
తెలంగాణలో దళిత రాజకీయం పీక్ స్థాయికి చేరింది..హుజూరాబాద్ ఎన్నికల్లో మెజారిటి వర్గంగా ఉన్న దళితుల ఓట్లకు గాలం వేసేందుకు నువ్వు నేనా అనే రీతిలో అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి దళిత సాధికారితకు ముందుకు వచ్చింది. ఇందుకోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సన్నద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేవలం హుజూరాబాద్‌లోనే రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకోసం నేడు 500 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది..
దీంతో బీజేపీ సైతం దళిత స్కీంలపై ఫైర్ అవుతోంది. అసలు దళిత బంధు పథకం తేవడానికి కారణమే మేమంటు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక దళిత బంధుతో బీజేపీ కొంత వెనకబాటు బడినట్టు కనిపిస్తుంది. ఇందుకోసం నేడు బడుగుల ఆత్మగౌరవ పోరు మీద ఇందిరా పార్క్ వద్ద ధర్నా కొనసాగించింది. దళితులకు పదికాదు ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేత బండి సంజయ్ డిమాండ్ చేయడంతోపాటు… దళిత ముఖ్యమంత్రి ,125 అడుగుల అంబెద్కర్ విగ్రహంపై బీజేపీ ప్రశ్నిస్తోంది.. మొత్తం ఇరుపార్టీలు దళితులను స్వంతం చేసుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. దళితుల ఆరాధ్యదైవం అయినా బాబా సాహెబ్ అంబెద్కర్ బోమ్మను కరెన్సి నోట్లపై ముద్రించాలంటూ కొత్త రాగం ఎత్తుకుంది.ఇందుకోసం ఆ పార్టీ నేత ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు..ఇదే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఆపార్టీ ఎంపీలకు సూచించారు.ఈ నేపథ్యంలోనే కరెన్సీ నోట్లపై అంబెద్కర్ ఫోటో సాధన కమిటితో ఆయన సమావేశం అయ్యారు.ఈ సంధర్భంగా ఆయన వారికి మద్దతు తెలిపారు. కాగా మరోవైపు సాధన సమితి బీజేపీ నేతలకు కూడా వినతిపత్రం అందించారు.
మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక మరోసారి దళితుల అభివృద్దిపై చర్చ కొనసాగడంతో ఆ వర్గాలకు కొంత మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని ఈ హమీలు, హంగామాలు కేవలం ఎన్నికల వరకేనా..లేక భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయా అనేది కాలం నిర్ణయించనుంది..