నటీనటులు: సీనియర్ నటి జయలలిత, అనిల్ ఆర్కా, విభిష జాను, అలేఖ్య గాదంబోయిన, బాచి, రమ్య తదితరులు
డిఓపీః ఆదిమల్ల సంజీవ్
సంగీతంః సుభాష్ ఆనంద్ నిరంజన్
ఎడిటర్ః ఆవుల వెంకటేష్
కొరియెగ్రఫీః కీర్తి శేషులు శివశంకర్ మాస్టర్, సుచిత్ర చంద్రబోస్
ఫైట్స్ః జాషువా
డైలాగ్స్ః రంగ
లిరిక్స్ః సాగర్
నిర్మాతః అనిల్ ఆర్కా కండవల్లి
స్టోరీ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంః రాము కోన
మనసును తాకే కథ ఉంటే సినిమాను సూపర్ హిట్ చేస్తారు ప్రేక్షకులు. గ్రామీణ నేపథ్యంలో హిట్టయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమా తెలుగు వెండితెరపైకి వచ్చేసింది. సీనియర్ నటి జయలలిత కీలక పాత్రలో అనిల్ ఆర్కా, విభిష జాను హీరో హీరోయిన్లుగా అలేఖ్య గాదంబోయిన కీలక పాత్రలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ మూవీ ‘రుద్రంకోట’. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ :
భద్రాచలం దగ్గరున్న ‘రుద్రంకోట’ గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. ‘రుద్రంకోట’ గ్రామ పెద్ద కోటమ్మ(జయలలిత). ఆమె అదేశాల మేరకు రుద్రుడు( అనిల్ ఆర్కా) తమ ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తాడు. ఆ ఊర్లో వీరి మాటకి ఎదురుండదు. రుద్రుడుకి స్వతహాగా అమ్మాయిలంటే ఇష్టముండదు. ఐతే అతన్ని శక్తి(విభీష జాను) గాఢంగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కోటమ్మ మనవరాలు(అలేఖ్య) ఊరిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రుద్రుడి పై మోజు పడుతుంది. కానీ రుద్రుడు కోటమ్మ మనవరాలిని చేరనీయడు. అటు తర్వాత అతను కూడా శక్తిని ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా శక్తి మరణిస్తుంది. ఆమె మరణానికి కారణం ఎవరు? కోటమ్మ, రుద్రుల జీవితం చివరికి ఎలా మారింది? కోటమ్మకి ఉన్న గతమేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.
నటీనటుల పనితీరు:
సీనియర్ నటి జయలలిత తనకిచ్చిన కోటమ్మ పాత్రలో జీవించేసింది. ఈ పాత్రకి ఆమె వంద శాతం న్యాయం చేసింది అని చెప్పొచ్చు. రుద్రుడుగా అనిల్ ఆర్కా కూడా చాలా అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర ‘కాంతార’ లో రిషబ్ శెట్టిని గుర్తుచేస్తుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఇక హీరోయిన్స్ లో విభిష శక్తి పాత్రలో చాలా చక్కగా నటించింది. అలేఖ్య కూడా చాలా చక్కగా నటించింది. ఈమె గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా అయ్యిందని చెప్పాలి. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక పనితీరు:
విజువల్స్, ఎమోషన్స్ మీద దర్శకుడు బాగా చూపించగలిగాడు. ఐదు పాటలున్నా ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్, నిరంజన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. కోటి బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో సినిమాకు హైప్ వస్తుంది. అనిల్ హీరోగా నటిస్తూనే, నిర్మాతగానూ బాధ్యత తీసుకోవడం విశేషం. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పదును పెడితే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
విశ్లేషణ:
‘శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. అక్రమ సంబందాల వల్ల పిల్లలకు ఎదురయ్యే సమస్యల మీద ప్రేమ, కామం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంచుకున్న పాయింట్‌ను చాలా స్పష్టంగా తెరకెక్కించడంలో సక్సెసయ్యాడు. ఈచిత్రంలో హీరో పాత్ర చిత్రణతో పాటు కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సీనియర్ నటి జయలలిత, యాక్షన్ సీన్స్, పల్లెటూరి నేపథ్యం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అనిల్ ఆర్కా నిర్మాతగా కూడా సినిమా అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు.సుభాష్ ఆనంద్, యువి నిరంజన్.. సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ కూడా సినిమాకి హైలెట్ అని చెప్పాలి. శ్రీ రంగ డైలాగులు కూడా బాగున్నాయి. ‘కాలంతో పోయే అందం ముఖ్యం కాదు.. కాలం చేశాక కూడా అందరూ గుర్తుంచుకునే వ్యక్తిత్వం ముఖ్యం’ అనే డైలాగ్ గుర్తుండిపోతుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ తప్పు చేస్తే ఎలాంటి ఘోరాలు జరిగాయో పురాణాల్లో చదువుకున్నాం, చరిత్ర కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఆధునిక యుగంలో స్త్రీలు ఎలా ఉండాలో ఈ సినిమాలో చాలా గొప్పగా చెప్పాడు దర్శకుడు రాము కోన. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ కట్టి పడేస్తుంది.కోటి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఛలో ‘రుద్రంకోట’.
రేటింగ్ : 3.25 / 5
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP