జైభీం సినిమా కాదు.. బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్!

Editorial Entertainment Latest News Political News Viral News
  • ఆది

నీచ నికృష్ట దగుల్బాజీ దరిద్రపుగొట్టు పరమచెత్తల ఫూట్ లఫంగీడస్ట్ వరస్ట్.. ఈ తిట్లు జై భీం సినిమా చూసిన తర్వాత మనం తీర్చిదిద్దే సాధారణ కథానాయక పాత్రలకు సంబంధించినవి.

అసలు హీరో అంటే జై భీంలో చంద్రూలా ఉండాలి.. పాత్రలంటే ఒక చినతల్లి, రాజన్నలాగుండాలి..అలా ఉండవు కాబట్టే.. తైతక్కలుసొల్లు సోదిడాఫర్ కామెడీ సీన్లతో మనం మన సినిమా కథలను నింపేస్తాం కాబట్టే.. తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో సినిమాలను తీసినా.. ఎంత మాత్రం నాణ్యత లేని.. కనీస జీవన ప్రమాణాల్లేని అసంబద్ధ చిత్ర పరిశ్రమగా కుళ్లు కంపు కొడుతూ బతుకునీడుస్తోంది.. జీవం లేక నీరవ నిర్జీవంగా..కేవలం వెకిలి చేష్టల సమాహారంగా మంచి కథో లక్ష్మణా! అంటూ జీవితకాలం పాటూ అంగలార్చుతోంది.. మనవాళ్లు తీసేదసలు సినిమా కాదు.. అతుకుల బొంత- నాలుగు సినిమాలను చూసి ఒక సినిమాగా మార్చేంత పనికిమాలిన సంత.ఇలాంటి చిత్రసీమను కలిగి ఉండటం ఓ నికృష్టం.. దీనంతటికీ కారణం.. సినిమా ఆత్మను పట్టుకోవడం చేతగాని పరమ వేస్టుగాళ్లు సినిమా పరిశ్రమ నిండా పడి ఉండటం.. తెలుగు ప్రేక్షక లోకం ఏనాడో.. చేసుకున్న దురదృష్టం..హేట్సాఫ్ సూర్య-జ్యోతిక- జ్ఞానవేల్- వీరి కృషి ఫ్రేం ఫ్రేంలో కనిపించింది..ఇంత నిఖార్సయిన కథ ఇటీవలి కాలంలో ఇదేనేమో..పాత్రల్లో ఉన్న ఆ నిజాయితీ వాసన.. ప్రతి క్షణం గుప్పు గుప్పుమంటూనే వచ్చింది..ఇదో లైవ్ స్టోరీ.. లైఫ్ స్టోరీ..ఇప్పటికే కాదు ఎప్పటికీ పాతకాని సరికొత్త స్టోరీ..గిరిజనులంతా దొంగలు కారనీ..పోలీసుల్లోనూ మంచి వాళ్లుంటారనీ..మానవహక్కుల లాయర్లలో చంద్రూలాంటి మహనీయులుంటారనీ..సగట మనిషికి బాధా తప్తహృదయులకుకాసింత ఊరట నిచ్చిన సినిమా జై భీం..బలహీనుడికి బలాన్నిచ్చే టానిక్ జై భీం..దీన్ని సినిమాగా చూడ్డంకన్నా ఒక కోర్సుగా ప్రపంచ సినిమా లైబ్రరీలో నిక్షిప్తం చేయాలి..

అప్పుడపుడూ ఈ సినిమాను విరివిగా ప్రదర్శించడం వల్ల..దైన్య స్థితిలో ఉన్న వారి వెన్నుముకను తట్టి ధైర్యం ప్రసాదించగలదు.. న్యాయాన్ని వదిలేద్దామా అన్న మీమాంశ కలిగిన వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేయగలదు.. ఇది సినిమా కాదు.. జీవితం.. ఊరవతలి బతుకుల్లోని స్వచ్ఛత కల్మషరాహిత్యానికి మచ్చు తునక.. వారిపై జరుగుతున్న అరాచకాలకు పరాకాష్ట.. వారికి కావల్సిందేంటో ప్రభుత్వాలకు సూచించే ఒకానొక సూచిక జైభీం ఈజ్ జైభీం..ఇట్స్ ఎక్సట్రార్డినరీ ఫిలిం.. దీన్ని సినిమా కేటగిరిలో వేయడం కూడా తప్పే..తీసిన వారిని మూవీ మేకర్స్ గా పిలవడమూ తప్పే..ఈ చిత్ర నిర్మాత- దర్శక- నటీ- నటులుసామాజిక బాధ్యత గల మహానుభావులు..వీరికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం.. జై భీం!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *