Editorial: ఇండియ‌లో టాప్ గేర్ వేసిన‌ క్రిప్టో కరెన్సీ

Editorial

ఎడిటోరియ‌ల్:

ఇటీవ‌ల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్‌లోనూ 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్‌బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్రం ‘క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ’ బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వీటి వినియోగం ఊపందుకుంది. ఎంతలా అంటే.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో నిలబడేంత. క్రిప్టోక‌రెన్సీల‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ రావ‌డంతో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌.. తాజాగా ఇండియాలోనే తొలి క్రిప్టో టోకెన్ గ‌రిని ఆవిష్క‌రించారు. క్రిప్టోక‌రెన్సీ ఫ్లాట్‌ఫామ్‌ల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో.. బాలీవుడ్ స్టార్ జీఏఆర్ఐని లాంచ్ చేశారు. మైక్రో కాంటెంట్‌, షార్ట్ వీడియో అప్లికేష‌న్ చింగారికి చెందిన‌దే గ‌రి.

క్రిప్టో కరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. అందుకు కారణం బిట్​కాయిన్ సహా వివిధ డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండటమే. ప్రస్తుతం ఇది ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నా.. కొన్నేళ్ల కిందటే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన వారు భారీ లాభాలను ఆర్జించారు. క్రిప్టో కరెన్సీ అనేది బయట మనకు ఎక్కడా కనిపించదు. ఇదో వర్చువల్​డీ సెంట్రలైజ్డ్​కరెన్సీ. ఎన్‌క్రిప్షన్‌తో కూడిన డిజిటల్ కరెన్సీ. ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్‌లో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఎవరైనా ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే క్రిప్టో మార్కెట్ ఎప్పుడూ తీవ్రమైన ఒడిదొడుకులతో నిత్యం విలువలు మారుతూ ఉంటాయి. అందుకే క్రిప్టో కరెన్సీతో కోటీశ్వరులు అయిన వారున్నారు.. తక్కువ కాలంలో తీవ్రంగా నష్టపోయిన వారూ ఉన్నారు. అందుకే దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్ చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే గతంలో పెట్టుబడులు పెట్టిన వారిని ఇది కోటీశ్వరులను చేసింది. క్రిప్టో కరెన్సీ సృష్టి, లావాదేవీలు తదితరాలను మైనింగ్ అంటారు. వీటి లావాదేవీలన్నీ బ్లాక్ చెయిన్ ద్వారా నమోదవుతాయి. అందువల్ల వీటిని హ్యాక్ చెయ్యడం కుదరదు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే కంప్యూటర్‌లో నిపుణులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేయవచ్చు. భారత్​లోనూ చాలా ఎక్స్చేంజీలు… కనీస ఛార్జీలు, కమీషన్లతో క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. డిజిటల్ పెట్టుబడులను కొన్ని యాప్స్ ద్వారా కూడా చేయవచ్చు. క్రిప్టోకరెన్సీలో ప్రధానమైన బిట్‌కాయిన్ ఒక్కోటి ప్రస్తుతం భారత కరెన్సీలో 29 ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌లు ఉండగా.. ఇథేరియమ్ 1 ల‌క్షా 70 వేల రూపాయ‌లు, డాగ్ కాయిన్ 15లక్షలుగా ఉంది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే ముందు ఎంచుకున్న ఎక్స్చేంజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ఉదాహరణకు మీరు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలంటే… మీరు 29 ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌లు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. కనీసం వంద రూపాయ‌ల‌తో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. తద్వారా కాయిన్ రేటు పెరిగితే… ఆ ప్రకారం… మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. కాయిన్ రేటు తగ్గితే… మీ పెట్టుబడి విలువ తగ్గుతుంది. సపోజ్ కాయిన్ రేటు ఓ 5 శాతం పెరిగితే… మీ 100 రూపాయ‌లు ధర… 5 శాతం పెరిగి.. 105 అవుతుంది. ఇలా తక్కువ మొత్తంతో కూడా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌లు అవకాశం ఇస్తున్నాయి. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ అనేది ఎవరి ఆధీనంలో ఉండదు. ఏ ప్రభుత్వాలూ దీన్ని కంట్రోల్ చేయలేవు. బ్లాక్​చెయిన్ టెక్నాలజీతో.. నడిచే ఈ క్రిప్టోకరెన్సీ విలువలు వ్యక్తుల పెట్టుబడులను బట్టి మారుతూ ఉంటాయి. కంప్యూటర్ కోడ్‌ల రూపంలో ఉండే వర్చువల్ కరెన్సీనే ఈ క్రిప్టో. కాగా బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ అన్ని లావాదేవీలు కనిపించే అవకాశం ఉండడంతో ఇది చాలా పాదర్శకమైనదని నిపుణులు చెబుతున్నారు.

చాలా దేశాల్లో క్రిప్టోకరెన్సీ.. అధికారికంగా చెలామణిలో లేకపోయినా చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టే వారు తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బును కాకుండా కొంతకొంతగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ విలువలు వేగంగా మారే అవకాశం ఉండడంతో రిస్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *