దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌

Editorial Latest News

సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేతో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వస్త్రంగా, కన్నీళ్ల కు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌.

కాలాన్ని కౌగిలించుకున్న సాహ‌సి.. జ‌యంతి, వ‌ర్థంతి ఏక‌మైన సాహితి ముత్యం. 

అలిశెట్టి ప్రభాకర్ సంధించిన కొన్ని అక్షరాస్రాలు..

“తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై.. (వేశ్య కవిత)”

“పేదవాడికి అందనివి, చెందనివి మచ్చుకు రెండు.. జూబ్లీహిల్స్ రాయి, కృష్ణా ఒబెరాయి!”

“నిలబడు.. బలపడు.. సంతకాలపైన కాదు, సొంతకాళ్ళపైన..!”

“సిరాబుడ్లు తాగి, కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదు! పెన్నుతో సమాజాన్ని సిజేరియన్ చెయ్యాలి”

“సూది మొన మీద ఆవ గింజని మోపటం వృథా శ్రమ.. నియంతృత్వపు తుపాకీ గొట్టం పైన భూగోళాన్ని ఆపటం భ్రమ”

“చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది.. గుండెంటూ కలిగుంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది!”

“ఈ వృక్షం నువ్వు ఉరిపోసుకోవడానికి వినియోగించబడింది కాదు.. స్వయం కృషిని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకొమ్మని”

“ఎల్లలు లేని కవితాకాశంలో ఎవరెవరి బాధలైనా రాస్తా.. క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా..!”

“హైదరాబాద్‌ మహావృక్షమ్మీద ఎవరికి వారే ఏకాకి”

“గుడిసెలే మేడల్ని కడతాయి.. ఐనా మేడలే గుడిసెల్ని కొడతాయి..!”

“న్యాయాన్ని ఏకీలుకాకీలు విరిచేసేవాడే వకీలు..”

“నీ లైఫ్‌ని బ్యూటిఫుల్‌ పేయింటింగ్‌గా మార్చుకోడానికి అట్రాక్టివ్‌ కలర్‌ ‘రెడ్‌’ కొరకు రక్తం మాత్రం ఎవరిదీ ఉపయోగించకు..!”

“తగిలించబడి యున్నది జాబిల్లి చైనా బజారు గగనములోన పైన అనవసరంగా అఘోరంగా..”

“గుండె నిండా బాధ కళ్ళనిండా కన్నీళ్ళున్నప్పుడు మాట పెగలదు కొంత సమయం కావాలి..”

“బర్త్‌డే పార్టీలంటే కొవ్వెక్కి ఉండటం కొవ్వొత్తులూదడం”

“తొంభై తొమ్మిది మంది చర్మాన్ని వొలిచి నూరో వాడొక్కడే పరుచుకునే తివాసీ ఈ దేశంలో కళాపోషణ”

“నగరాల్లో అత్యధికంగా అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి”

“ఎందుకురా కవి గజిబిజి ఇమేజీ అస్పష్ట కవిత్వం కన్నా ఆల్జీబ్రా ఈజీ”

“అలా సమాధిలా అంగుళం మేరకన్నా కదలకుండా పడుకుంటే ఎలా? కొన్నాల్లు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెల్సి చావదు”

“నా కవిత్వం బ్యాంకులో దాచే అక్షర లక్షలన్నీ అక్షరాలా మీకే..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *