శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన టీనేజ్ లవ్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రేమించొద్దు’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్ మరియు బి సినీ ఈటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించగా, శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై నిర్మించారు.
ఇది బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథ. ‘ప్రేమించొద్దు’ సినిమాను 5 భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనేది ఎలా ప్రభావం చూపుతుందో రా అండ్ రస్టిక్ శైలిలో ఈ సినిమా తెరకెక్కింది. స్కూల్, కాలేజ్ వయసు ప్రేమకథలు, ప్రేమ వల్ల విద్యనికి సంబంధించిన నిర్లక్ష్యాన్ని సున్నితంగా చూపించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ, ‘‘ఇది వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఓటీటీలలో అందుబాటులో ఉంది. ‘బేబీ’ సినిమా నిర్మాతలు నా కథను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాను. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ప్రేక్షకుల సహాయం నాకెంతో అవసరం,’’ అని తెలిపారు.
నటీనటులు
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు.
సాంకేతిక విభాగం
రచన, నిర్మాణం, దర్శకత్వం: శిరిన్ శ్రీరామ్
సంగీతం: జునైద్ కుమార్
బ్యాగ్రౌండ్ స్కోర్: కమ్రాన్
సినిమాటోగ్రఫీ: హర్ష కొడాలి
స్క్రీన్ ప్లే: శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం
పబ్లిసిటీ డిజైన్: అజయ్ (ఏజే ఆర్ట్స్)
వి.ఎఫ్.ఎక్స్: వి. అంబికా విజయ్
ప్రొడక్షన్ సూపర్వైజర్: నిఖిలేష్ తొగరి