- ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
- చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే ఆలోచిస్తారని, మాయావతి బిసి జనాభా గణనకు సిద్ధంగా ఉందన్నారు..
హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జనగణనకై ఐక్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఆర్ఎస్ప్ర వీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించి నేటి వరకు బయట పెట్టలేదన్నారు. కెసిఆర్ డేటా తన దగ్గర ఉంచుకుని ఏ కులం ఓట్లు మార్చుకోవాలనే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నాడు ఎన్టీ రామారావు మురళీధర్ కమిషన్ బిసిల కోసం తీసుకొచ్చాడని గుర్తు చేశారు. 1991లో మండల్ కమిషన్ వచ్చినప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాన్నారు. గొర్రెలు బర్రెలు రకరకాల పథకాలు ఉన్నాయి అవి మాత్రమే తీసుకోండి కానీ బడుగు బలహీన వర్గాలు సంపదలకు రావద్దనే కుట్రలు ప్రభుత్వం పన్నుతుందన్నారు. చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లో ఎస్సీ, బిసి కులాల వాళ్ళు ఎంత మందిని పెట్టుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో మొత్తం ఇదే రీతిలో నడుస్తుందన్నారు. గ్రామాలలో ప్రజలకు జన గణన విషయాలు చెప్పవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కాంటాక్ట్ చేయడంలో విఫలమైందన్నారు. ప్రవీణ్ కుమార్ అంటే అందరి వాడు కొందరు వాడు కాదన్నారు. కాళేశ్వరంలో కాంట్రాక్టర్లు బడుగు బలహీన వర్గాలు కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరన్నారు. బిసి గణనకు బిజెపి పార్టీ ఎందుకు వెంటాడుతున్నది, దాంతో పాటు అన్ని పార్టీలు ఎందుకు వెనుకంజ ఉంటున్నాయని అన్నారు.
డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. బీసీలకు తప్పకుండా గణన కావాలని, అందుకు జాతీయ స్థాయిలో బిఎస్పి పార్టీ నుండి మాయావతిని ప్రవీణ్ కుమార్ ఒప్పించ వలసినది బాధ్యత తీసుకోవాలన్నారు. రాజకీయంగా ఎదిగిన బిసి కులాల ప్రజా ప్రతినిధులు బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. బీసీని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీ గణన చేయకపోతే పోతే బీసీల ద్రోహం చేసినట్లేనన్నారు. భవిష్యత్ తరాల కోసం బీసీ సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ 1935 లోనే బ్రిటీష్ గవర్నమెంట్ లో బ్యాక్వర్డ్ క్లాస్ డేటా ఉందని, రిజర్వేషన్ అనేది ప్రతి దేశంలో ఉంటుందన్నారు. తెలంగాణ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కాని దేశంలో బీసీలో నడుము కడుక్కొని తింటున్నారన్నారు. పేదల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీలలో కూడా అగ్రవర్ణాల వాళ్లకి పెత్తనం ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 29 శాతం మాత్రమే బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారన్నారు. రాజ్యాంగంలో బీసీ కులాలకు విద్య వైద్యం స్పష్టంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నదని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పార్టీల మేని ఫెస్టివల్ చదవడం కాదు రాజ్యాంగం చదవాలన్నారు. రాజకీయాల్లో కులాల పేరుతో బీసీ వర్గాలను తొక్కేస్తున్నారన్నారు. దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిల్ మాట్లాడుతూ భారతదేశంలో జన గణనపై చిన్న చూపు ఉంటుందన్నారు. బిసిలలో కూడు, గూడు గుడ్డ లేని వారిని గణన చేయాలన్నారు. బహుజనులు ప్రగతి భవన్ వస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న మాటతోనే అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారన్నారు.