మేడ్చల్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో జోష్ మీదుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. రేవంత్ తన సన్నిహితుడైన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నియోజవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తున్నాడు.
తాజాగా బోడుప్పల్-పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో SNDP పనులు ఇంకెన్నాళ్లు అంటూ తోటకూర వజ్రేష్ యాదవ్ నిరసన తెలుపుతూ చేపట్టిన దీక్ష కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు మొద్దు నిద్రను వదిలి మొదలు పెట్టాల్సిన పనులపై దృష్టి పెట్టాలని ఆయన విమర్శించారు.
అలాగే మూడుచింతల పల్లి మండలం, లక్ష్మాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇల్లు కట్టించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేపించి రేవంత్ తో కలిసి సందర్శించారు.
ఇలా మేడ్చల్ లో కాంగ్రెస్ మంచి జోరు మీదుంది. నిత్యం ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.