▪️ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలందరూ ఐకమత్యంతో ఉండాలి
▪️ బాలాపూర్ – వైఎంఆర్ గార్డెన్స్‌లో బీసీ ఐక్యవేదిక సదస్సు
▪️ T-PCC ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బాలాపూర్ రోడ్డులోని వైఎంఆర్ గార్డెన్స్ లో బీసీ ఐక్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, టీ-పీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్ హాజరయ్యారు.
సందర్భంగా టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ యువతకు ఎటువంటి స్వయం ఉపాధి పథకాలు లేక, నియామకాలు లేక అడుగడుగున అవమానమే జరుగుతుందని జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 54 శాతంగా ఉన్న బీసీలను కొంతమంది అల్ప సంఖ్యాకులుగా ఉన్నవారు నియంత్రణ చేసే పరిస్థితి తయారయిందని, రానున్న రోజుల్లో బీసీలకు దామాషా ప్రకారం సంక్షేమ పథకాలు రూపొందించి అన్నింటిలోనూ బీసీలకు ప్రాధాన్యత నివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీలంతా ఏకమై తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
BREAKINGNEWS TV & APP
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/