కోదాడ: బీఆర్ఎస్ టికెట్ భార్యాభ‌ర్తల్లో ఒక‌రికి?

Latest News

జలగం సుధీర్, కల్లెంపూడి సుష్మా (BC మహిళ)లలో ఒకరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం

కోదాడ / హైద‌రాబాద్: ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం కోదాడ. రెండు రాష్ట్రాలకు వారథి మాదిరిగా ఉండే ఈ స్థానం.. తెలంగాణకు ముఖ ద్వారంగా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ పరిధిలో ఉన్న ఈ స్థానంలో ఇటు నల్గొండ, అటు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సెటిలర్లు ఉంటారు. ఇక్కడ రాజకీయం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఈ సారి ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవ‌రికి టికెట్ ఇస్తారు అనే ప్ర‌శ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అంద‌రి దృష్టి మాత్రం ఎన్నారై జంట‌పై పడింది.

ఉన్నత విద్యావంతులైన సుధీర్, సుష్మాలు 2001 నుండి పార్టీ కోసం పనిచేస్తున్నారు. అమెరికాలో లక్షల్లో సంపాదనను కాదనుకొని గత ఎనిమిదేళ్లుగా అనేక సమస్యల మీద పనిచేసిన అనుభవం, మొబైల్ షీ టాయిలెట్ లు, మిని లైబ్రరీలు, వాల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, టీ విత్ హెడ్మాస్టర్, మొబైల్ ట్రామా సెంటర్ లాంటి వినూత్న ఆలోచనలు చేయటం ద్వారా మంత్రి కేటీ రామారావు, MLC కవిత దృష్టిని ఆకర్శించారు. ఒకవైపు నూతన ఆవిష్కరణలు చేస్తూనే కోదాడ ప్రాంతంలో నివాసం ఉంటూ దాదాపు అన్ని గ్రామాల్లోని సమస్యల విషయంలో స్థానికులతో సమావేశమవుతూ విద్యా, వైద్యం, ఉపాధి, కబ్జాలపై ఫిర్యాదులు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ లు, డిజిటల్ పాఠాలు లాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

రాజకీయంగా స్వపక్షం నుండి ఎదురైన ఇబ్బందులను కూడా పార్టీకి నష్టం జరగకుండా సమన్వయం చేసుకుంటూ వివాదరహితంగా ఉండటం వ‌ల్ల జ‌ల‌గం సుధీర్‌కు 2023 ఎలక్షన్ రేసులో ఉండేలా చేసింది. ఒకవేళ మహిళలకు ఈ సీట్ కేటాయించాలని చూస్తే ఎమ్మెల్సీ కవితకి మిత్రురాలైన BC వర్గానికి చెందిన సుష్మా పేరు కూడ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ దంపతులకు పార్టీ నుండి సంకేతాలు కూడా వెళ్లాయ‌ట‌. ఆగస్ట్ నుంచి అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

 

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *