బండ్ల గూడ, పోచారం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు తీసుకోండి

Latest News

ప్రభుత్వ శాఖలకు అధికారుల లేఖలు
ఉద్యోగులూ కొనకుంటే పబ్లిక్​కు ఛాన్స్

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్లను తీసుకోవాలని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను హౌసింగ్ అధికారులు కోరారు. ఈ మేరకు సీఎస్ ఆదేశాలతో అన్ని శాఖలకు లేఖలు రాశారు. 6 సార్లు వేలం నిర్వహించినా ఈ ఫ్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. దాంతో వాటిని కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులు చాన్స్ ఇచ్చారు. వీళ్లు కూడా ముందుకు రాకపోతే ఓపెన్ సేల్ విధానంలో పబ్లిక్ కు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉంచుతామని చెబుతున్నారు.

మొత్తం 795 ఫ్లాట్స్
బండ్లగూడ, పోచారంలో సింగిల్, డబుల్ బెడ్రూమ్ లు కలిపి సుమారు 795 ఫ్లాట్లు ఉన్నాయి. బండ్లగూడలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్182 ఉండగా, పోచారంలో సింగిల్ 256, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 357 ఉన్నాయి. బండ్ల గూడలో 1 బీహెచ్ కే రూ.15లక్షలు, పోచారంలో సింగిల్ రూ.13లక్షలు, 2బీహెచ్ కే రూ.19లక్షలుగా నిర్ణయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

గత నెల వేలానికి మంచి రెస్పాన్స్
గత నెలలో బండ్లగూడ , పోచారంలో ఫ్లాట్లను వేలం వేశారు. ఇందులో ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన వారికి ఫ్లాట్ ఇస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బండ్ల గూడలో 34 త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లకు ఏకంగా 364 మంది బిడ్ దాఖలు చేశారు. ప్రభుత్వం 3బీహెచ్ కే ఫ్లాట్ చదరపు అడుగు(ఎస్ఎఫ్ టీ)కి రూ.3 వేలు ఖరారు చేయగా.. అత్యధికంగా రూ.4400 పలికింది. అత్యల్పంగా రూ.3900 పలికింది. ఇలా 34 ఫ్లాట్లను వేలం వేయగా అన్ని అమ్ముడయ్యాయి. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కొనేందుకు పబ్లిక్ ముందుకు రాకపోవటంతో డిపార్ట్ మెంట్లకు లేఖ రాశారు.

నెమ్మదిగా అమ్ముడవుతున్న టవర్లు
పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్​లో రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లను హౌసింగ్ అధికారులు టవర్ల వారీగా వేలానికి పెట్టారు. వీటిని గుంపగుత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్లకు అమ్మనున్నారు. గాజుల రామారంలో 2 టవర్లను ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ తీసుకుందని ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. మరో 3 టవర్లను తీసుకునేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారని చెప్పారు. ఇక జవహర్ నగర్​లో 17 టవర్లలో మొత్తం 2800 ఫ్లాట్లు వేలానికి ఉంచగా, అక్కడ డంపింగ్ యార్డ్ వల్ల పొల్యూషన్, పొగ, దుర్వాసన ఉంటుందని కొనేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని అధికారులు చెబుతున్నారు. పోచారంలో 4 టవర్లు ఇంకా వేలానికి ఉన్నాయి.

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *