పూరీ “డబల్ ఇస్మార్ట్” ఎలా ఉండ‌బోతోంది?

Entertainment

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీ ఇష్మార్ట్ శంకర్. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరా భారీ విజయాన్ని అందుకుంది. రామ్ అండ్ పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాను సీక్వెల్ గా “డబల్ ఇస్మార్ట్(Double ismart)” సీన్ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా జులై 10న “డబల్ ఇస్మార్ట్” సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాధ్, రామ్, ఛార్మి(Charmi) పాల్గొన్నారు. దీనికి సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా.. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati srinu)తో స్కంద(Skanda) సినిమా చేస్తున్న రామ్.. ఈ సినిమా కంప్లీట్ అవగానే “డబల్ ఇస్మార్ట్” షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి బ్లాక్ బస్టర్ సినిమాను సీక్వెల్ గా వస్తున్న “డబల్ ఇస్మార్ట్” పూరి అండ్ రామ్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే 2024 మార్చ్ 8వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *